/rtv/media/media_files/2025/07/24/parliament-2025-07-24-08-26-07.jpg)
Parliament Monsoon sessions
ఆపరేషన్ సింధూర్ పై చర్చకు ముహూర్తం ఖరారు అయింది. పహల్గాం ఉగ్రదాడితో ముడిపడిన పరిణామాలపై సమగ్ర చర్చ జరగాలని...తాము అడిగిన అన్ని ప్రశ్నలకూ ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ప్రస్తుతం మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. 26న తరిగి భారత్ కు నానున్నారు. దీంతో ఆపరేషన్ సింధూర్ మీద చర్చకు ఈ నెల 28న దిగువసభలో, మరుసటి ఎగువ సభలో చర్చించేందుకు నిర్ణయించారు. దీనిపై మొత్తం 16 గంటల సమయం కేటాయించాలని రాజ్యసభ సభా వ్యవహారాల సంఘం నిర్ణయించింది. అయితే దీనికి ప్రధాని మోదీ వస్తారా లేదా అనేది ఇంకా కన్ఫార్మ్ కాలేదు. కానీ మోదీ తప్పకుండా వర్షాకాలం సమావేశాలు పూర్తయ్యేలా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడతారని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
మూడు సార్లు సభ వాయిదా..
ఇప్పటికే పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు మొదలై రెండు రోజులు అయింది. ఈ క్రమంలో నిన్న మొదటిసారి రాజ్యసభ బీఏసీ సమావేశం జరిగింది. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ దీనికి అధ్యక్షత వహించారు. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సత్వర సవరణ పై చర్చకు విపక్షాలు రాజ్యసభలో మరోసారి డిమాండ్ చేశాయి. వాయిదా తీర్మాన నోటీసులివ్వడమే కాక కార్యకలాపాలను అడ్డుకున్నాయి. దీంతో సభను మూడుసార్లు కొంతసేపు వాయిదా వేయాల్సి వచ్చింది. నోటీసులను తిరస్కరించిన హరివంశ్ సభను గురువారానికి వాయిదావేశారు. మరోవైపు ఎంపీలపై లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు వారిస్తున్నా సమావేశాలకు ఎంపీలు ప్లకార్డులతో రావడంపై ఆయన మండిపడ్డారు. తాము చేస్తున్న పనికి తగ్గట్టు ప్రవర్తన కూడా ఉండాలని అన్నారు. పార్లమెంటేరియన్లలా మీరుండాలి. సభలోకి ప్లకార్డులు తీసుకురాకూడదు. మీరు దీనిని ఇలాగే కొనసాగిస్తే నేను నిర్ణయాత్మక చర్యలు చేపట్టక తప్పదని ఓంబిర్లా హెచ్చరించారు.
Also Read: Water Bomb: వాటర్ బాంబ్ తో భారత్ కు ఏం ప్రమాదం లేదు..చైనా