/rtv/media/media_files/2025/04/24/zCsImQMw0N3XvkhBtD3M.jpg)
Government of Pakistan's account on 'X' blocked in India
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌కు సంబంధించిన ఎక్స్ అధికారిక ఖాతాను బ్లాక్ చేసింది. ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రతీకార చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఆ దేశానికి సంబంధించిన ఎలాంటి సమాచారం కూడా భారత్‌కు తెలియాల్సి అవసరం లేదని భావిస్తూ వారి ఎక్స్ ఖాతాను బ్లాక్ చేసింది. ఇప్పటికే పాక్‌తో భారత్ దౌత్య సంబంధాలు కూడా తెంచుకుంటున్న సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది.
Government of Pakistan's account on 'X' withheld in India pic.twitter.com/Lq4mc2G62g
— ANI (@ANI) April 24, 2025
Also Read: నీళ్ల నుంచి వ్యాపారం వరకు.. భారత్ నిర్ణయంతో పాక్ కు చుక్కలే.. ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే?
#BREAKING
— Aishwarya Paliwal (@AishPaliwal) April 24, 2025
X blocks Govt of Pakistan's account in India.
Government of India had requested X to block Govt of Pakistan's X account in India, upon that request, Govt of Pakistan's account has been withheld in India. pic.twitter.com/N2zA1yZNGf
పాక్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటించి వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని తాజాగా ఆదేశించింది. పహల్గాం దాడి తర్వాత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ బధవారం సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలును వెంటనే నిలిపివేస్తూట్లు ప్రకటన చేసింది. భారత్, పాక్ మధ్య రాకపోకల కోసం ఉండే అట్టారీ చెక్ పోస్ట్ మూసివేయడం, పాకీస్థానీయులకు వీసాలను నిషేధించడం లాంటి నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇప్పుడు తాజాగా పాక్ ప్రభుత్వం ఎక్స్ ఖాతాను కూడా బ్లాక్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: ఉగ్రదాడి వేళ.. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు కీలక నిర్ణయం
The X handle of the Government of Pakistan has been withheld in India. Now the next step should be to withheld all Paki YT, X and FB accounts operating from Indian soil . pic.twitter.com/rZyFYHHJ4v
— Prabhat Ranjan (@prabhatranjansr) April 24, 2025
telugu-news | national-news