Ind-Pak: నీళ్ల నుంచి వ్యాపారం వరకు.. భారత్ నిర్ణయంతో పాక్ కు చుక్కలే.. ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే?

కాశ్మీర్లోని ఉగ్రదాడికి సీమాంతర ఉగ్రవాదమే కారణమని అంటోంది భారత్. దీన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ కు సంబంధించి ఐదు నిర్ణయాలను తీసుకుంది. వీటితో ఆ దేశం అన్ని రకాలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదు.

author-image
By Manogna alamuru
New Update
decisions

India-Pakistan

 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం దిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ  పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్ పౌరులు, పర్యటకులు ఎవరైనా ఇండియాలో ఉంటే వారం రోజుల్లో వారి దేశానికి వెళ్లాలని అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ను వెంటనే నిలిపివేస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది.  పాక్ పౌరులును ఇండియాలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. SAARC వీసా మినహాయింపు పథకం (SVES) వీసాల కింద పాకిస్తానీ పౌరులు భారత్ లో ప్రయాణించడానికి అనుమతించబడరు. ప్రస్తుతం భారత్ లో ఉన్న వారు కూడా 48 గంటల్లో తమ దేశానికి వెళ్ళిపోవాలి . అలాగే సింధు జాలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. గతంలోనే ప్రధాని మోదీ రక్తం, నీరు కలిపి ఒకచోట ప్రవహించలేదు అని అన్నారు. కానీ ఇప్పటి వరకు పాక్ ను ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో సిధుజలాల జోలికి వెళ్ళలేదు. తాజాగా పాక్ తో దౌత్య సంబంధాలతో పాటూ 64 ఏళ్ళ సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది భారత్. ఈ ఐదు నిర్ణయాలు పాకిస్తాన్ పై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. నీళ్ళ నుంచి వ్యాపారం వరకూ పాకిస్తాన్ కు చుక్కలు చూపించనుంది భారత్. 

సింధుజలాల ఒప్పందం..

ఇది పాక్ చాలా పెద్ద షాక్. ఇండస్ రివర్ వాటర్ ఆగిపోతే పాకిస్తాన్ ఎడారిగా మారుతుంది అనడంతో ఎటువంటి సందేహం లేదు.  ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. దీనికి ప్రధాన ఆయువు ఇండస్ రివర్ వాటర్ ఒక్కటే. మొత్తం దేశ వ్యవసాయం సింధూ జలాలపైనే ఆధారపడి ఉంటుంది.  అక్కడి పంజాబ్, సింధ్ వంటి రాష్ట్రాలకు ఇదే ప్రధాన వనరు. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాలు అతి తక్కువ నీటి వనరులు కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఈ నీటిని ఆపేస్తే ఈ ప్రాంతాలన్నీ ఎడారిగా మారతాయి. ఇప్పటికే విపరీతమైన ద్రవ్యోల్బణం, పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఈ దెబ్బకు మలమల మాడిపోవడం ఖాయం. దీంతో అక్కడ తాగు నీటికి , విద్యుత్ కు కూడా కొరత ఏర్పడుతుంది. దీంతో ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజారిపోతుంది. 

వ్యాపార నష్టం..

భారత్ తీసుకున్న నిర్ణయాల్లో అట్టారీ చెక్ పోస్ట్ ఒకటి. దీన్ని మూసివేయడం వలన రెండు దేశాల మధ్యనా రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. దీనివలన భారత్ నుంచి ఇప్పటివరకు తరలి వెళుతున్న వస్తువుల రవాణా ఆగిపోతుంది. దీంతో అక్కడి వ్యాపారులకు ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. ఎప్పటి నుంచో రెండు దేశాల మధ్యనా ద్వైపాక్షిక వాణిజ్యం మూసివేయబడింది. దానికి తోడు ఇప్పుడు చిన్న చిన్న వస్తువుల మార్పిడి కూడా లేకపోతే పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారవనుంది. 

వీసా సేవలు..

పాకిస్తానీయులకు వీసాలను కూడా భారతదేశం నిషేధించింది. దీని వలన ఆ దేశం నుంచి పూర్తిగా రాకపోకలు ఆగిపోతాయి. రెండు దేశాలు విడిపోయి చాలా కాలం అయినప్పటికీ పాకిస్తానీయులకు భారత్ లో బంధువులు ఉన్నారు. వారిని కలవడానికి ఇప్పటివరకు రాకపోకలు జరుగుతుండేది. కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు. దీంతో బంధువులమంటూ వచ్చే ఉగ్రవాదులు, శత్రువులను పూర్తిగా కట్టడి చేసినట్లువుతుంది. 

హై కమీషన్ చర్య..

న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో నియమించబడిన సలహాదారులను దేశం విడిచి వెళ్ళిపోమని చెప్పారు. ఆ దేశం నుంచి భారత సలహాదారుడిని కూడి వెనక్కు రప్పిస్తున్నారు. ఈ చర్య రెండు దేశాల మధ్య సైనిక స్థాయి చర్చలు మరియు సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తుంది. అదే సమయంలో, సిబ్బందిని తగ్గించడం పాకిస్తాన్ దౌత్యానికి దెబ్బ అవుతుంది.

 today-latest-news-in-telugu | india | pakistan 

Also Read: Palestine: హమాస్ కుక్కల్లారా అంటూ పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ మండిపాటు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు