సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో రెండు సార్లు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆరు సెంట్రల్ యూనివర్సిటీలకు ఈ రూల్ వర్తించనుంది. రాజ్యసభలో ఒక ప్రతిపక్షాలు అడిగిన ఓ ప్రశ్నకు ఇది సమాధానంగా చెప్పారు. దీంతో సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ చేయాలనుకునే వారికి మంచి అవకాశం రానుంది. ఇది కూడా చదవండి : పేరుకేమో స్పా సెంటర్.. కానీ లోపల చేసే పని.. హైదరాబాద్ లో హెచ్సీయూ లా, కేరళ, రాజస్థాన్, పంజాబ్, తేజ్ పుర్, నాగాలాండ్ ప్రాంతాల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఏడాదికి రెండుసార్లు ఎంట్రన్స్ నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ తెలిపారు. ఇది కూడా చదవండి : ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. రూ.300కే కనెక్షన్! రెండుసార్లు ప్రవేశాలు నిర్వహించాలంటే దానికి అవసరమైన తరగతి గదులు, హాస్టల్స్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి వచ్చే అకాడమిక్ ఈయర్ నుంచి అమలు చేసే అవకాశం ఉందని HCU వీసీ తెలిపారు. ఇప్పటికే పీహెచ్‌డీ కోసం రెండుసార్లు ప్రవేశాలకు చేపడుతున్నారు. ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు Also Read: మహిళల విభాగంలో.. చిల్లపల్లికి జాతీయ అవార్డు