తెలంగాణలోని పెద్దపల్లి మండలంలోని చిల్లపల్లి గ్రామపంచాయితీ జాతీయ అవార్డుకి సెలక్ట్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన జాతీయస్థాయి పంచాయితీ-2024 మహిళ విభాగంలో అవార్డుకు ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం మొత్తం 9 అవార్డులను ఎంపిక చేసింది. ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు జాతీయ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ అవార్డుకు.. ఇందులో జాతీయ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ అవార్డుకు తెలంగాణ నుంచి కేవలం రాష్ట్రం చిల్లపల్లి మాత్రమే ఎంపికైంది. ఢిల్లీలో రాష్ట్రపతి చేతులు మీదుగా ఈ అవార్డును ఈ నెల 11న ప్రదానం చేయనున్నారు. అలాగే చిల్లపల్లి గ్రామానికి రూ.75 లక్షల నజరానా కూడా ప్రకటించారు. చిల్లపల్లి పంచాయతీ ఈ అవార్డుకు ఎంపిక కావడంతో పలువులు ఎమ్యె్ల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చూడండి: Farmer suicide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య చిల్లపల్లి గ్రామపంచాయతీకి ఈ అవార్డు రావడం వెనుక మహిళలు, గ్రామ ప్రజల కృషి ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. అభివృద్ధిలో భాగంగా గ్రామంలో మహిళల ఆర్థిక అభివృద్ధి, మహిళల ఆరోగ్యం, రాజకీయ అవగాహన, విద్య, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి, మహిళలల్లో చైతన్యం, మహిళా పార్క్‌లు, అంగన్‌వాడీ సెంటర్లు, మహిళా వ్యాయామశాల, చిల్డ్రన్ పార్క్, హెల్త్ సబ్ సెంటర్, వైకుంఠధామం, నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్, పంచాయతీ నర్సరీ వంటివి ఏర్పాటు చేశారు. ఇది కూడా చూడండి: సంధ్య థియేటర్ ఘటనపై ఎట్టకేలకు స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం ఇవే కాకుండా మిగతా అంశాలపై కూడా గ్రామం అన్ని రంగాల్లో ముందు ఉండి అవకాశం కల్పించారని గ్రామస్థులు చెబుతున్నారు. అన్ని రంగాల్లో ముందు ఉండి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఈ అవార్డు వచ్చిందని గ్రామస్థులు అంటున్నారు. ముఖ్యంగా మహిళల లోన్లు తీసుకుని సరైన సమయానికి కట్టడం వల్ల అవార్డు వచ్చిందని భావిస్తున్నారు. ఇది కూడా చూడండి: ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. తక్కువ ఖరీదుకే కనెక్షన్!