Lavoo Mamledar: మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపిన ఆటో డ్రైవర్..! (VIDEO)

గోవా మాజీ ఎమ్మెల్యే లావూ మావ్లేదార్‌ (68) మృతి చెందారు. ఓ ఆటోడ్రైవర్‌ ఆయనపై దాడి చేసిన అనంతరం ఆయన కుప్పకూలి ప్రాణాలు విడిచారు. శనివారం ఆయన కర్ణాటకలో పర్యటించారు. కారు ఢీకొందని ఓ ఆటో డ్రైవర్‌ ఆయనపై దాడి చేశాడు. ఆ తర్వాత మావ్లేదార్‌ కుప్పకూలి చనిపోయారు.

New Update
Goa EX MLA Lavoo Mamledar

Goa EX MLA Lavoo Mamledar

గోవా మాజీ ఎమ్మెల్యే లావూ మావ్లేదార్‌ (68) మృతి చెందారు. ఓ ఆటోడ్రైవర్‌ ఆయనపై దాడి చేసిన అనంతరం ఆయన కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఇక వివరాల్లోకి వెళ్తే లావూ మావ్లేదార్‌ శనివారం కర్ణాటకలోని బెలగావిలో పర్యటించారు.  ఖడేబజార్‌లోని ఓ హోటల్‌లో సూట్ రూం బుక్‌ చేసుకున్నారు. హోటల్‌ వైపు వెళ్తుండగా.. ఆయన కారు ఓ ఆటోను ఢీకొంది.  దీంతో ఆ ఆటోడ్రైవర్‌ మావ్లేదార్‌తో గొవడకు దిగాడు. ఆయనపై దాడి కూడా చేశాడు.

Also Read: రండి.. రండి.. పానీ పూరీ తింటే రూ.21 వేల ప్రైజ్‌మనీ.. ఎగబడుతున్న కస్టమర్స్!

 తన ఆటోకు జరిగిన ప్రమాదంపై డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. కానీ ఇందుకు మావ్లేదార్ ఒప్పుకోలేదు. హోటల్‌ వైపు తన ప్రయాణాన్ని కొనసాగించారు. అనంతరం హోటల్‌కు చేరుకున్నాక ఆ ప్రాంగణంలోనే మావ్లేదార్ కుప్పకూలిపోయారు. ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: డేంజర్ జోన్‌లో ఇండియా.. అణబాంబు కంటే 500 రెట్ల వినాశనం!

అయితే  ఆ ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు బెలగావి డీసీపీ రోహన్ జగదీశ్ తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. మరోవైపు మావ్లేదార్‌ మృతికి గల కారణాలపై కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. డ్రైవర్ దాడి వల్లే చనిపోయారా ? లేదా ఆయనకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు