AirPods Viral Video : ఓర్నీ వీడి తెలివి తగలెయ్య...ఎయిర్‌పాడ్స్‌ను ఇలా కూడా వాడుతారా?

ఈ మధ్య జనాలకు క్రియేటివిటీ మరి ఎక్కువైంది. ఏ వస్తువును ఎలా వాడాలో వీరిని చూసే నేర్చుకోవాలి అనేలా వారి పోకడలు ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా ఎయిర్‌ పాడ్స్‌ ను పాటలు వినేందుకు వాడుతుంటాం. కానీ ఒకయన వాటిని పొగాకు బాక్స్ గా వినియెగించిన తీరు వైరలైంది.

New Update
AirPods

AirPods

AirPods  :  ఈ మధ్య జనాలకు క్రియేటివిటీ మరి ఎక్కువైంది. ఏ వస్తువును ఎలా వాడాలో వీరిని చూసే నేర్చుకోవాలి అనేలా వారు చేస్తు్న్న పనులు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. సాధారణంగా ఎయిర్‌ పాడ్స్‌ ను పాటలు వినేందుకు మాత్రమే వాడుతుంటాం. కానీ, తాజాగా ఒక వ్యక్తి ఎయిర్‌ ప్యాడ్స్‌ కేస్‌ (ప్యాడ్స్‌ పెట్టుకునే బాక్స్‌)ను వాడుతున్న విధానం చూస్తే ఎవరైనా నోరెళ్లబెడుతారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో అందరూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. 

Also Read :  రీతూ వర్మ రొమాంటిక్ థ్రిల్లర్.. ట్రైలర్ ఇక్కడ చూడండి!

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోబట్టి చూస్తే అది హిందీ మాట్లాడే ప్రాంతానికి చెందిందిగా తెలుస్తోంది. దాన్ని చూసినవారంతా  ఓర్నీ నీ తెలివి తగలెయ్య.. ఎయిర్‌పాడ్స్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
  ఇది కూడా చూడండి: Windsor Pro electric SUV: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..
ఎయిర్‌పాడ్‌ల  చార్జింగ్ కోసం వినియోగించాల్సిన కేసును మన వాడు ఏకంగా తంబాకు బాక్స్‌గా మార్చేశాడు. దాన్ని ఏకంగా ఖైనీ స్టోరేజీగా మార్చేశాడు. ఎయిర్‌ ప్యాడ్స్‌ పెట్టాల్సిన రెండు బాక్స్‌లు ఒపేన్‌ చేసి చూస్తే అందులో ఒకదానిలో సున్నం, మరోదానిలో పొగాకు దర్శనమిచ్చింది. సాధారణంగా పొగారు నమిలేవారికి రెండు వైపుల బాక్స్‌లు ఉండే చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి. వాటిలో ఒకదానిలో పొగాకు, మరోదానిలో సున్నం నిల్వ చేస్తారు. అవసరమైనప్పుడు రెండింటిని చేతిలో వేసుకుని నలిపి నోటిలో వేసుకుంటారు. కాగా మనవాడు ఎయిర్‌ పాడ్‌లను ఖైనీ స్టోరేజీగా మార్చాడు. అందులోని పొగాకును చేతిలో వేసుకుని, నలిపేసి నోట్లో వేసుకున్నాడు. 

కాగా అతని క్రియేటివిటికి అందరూ తెగ నవ్వుకుంటున్నారు. ఇది వైరల్‌ కావడంతో రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఎయిర్‌పాడ్స్‌ కేసును కాస్తా.. పొగాకు బాక్స్‌గా మార్చారు కదా.. ఏం బుర్రలురా మీవి అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

Also Read :  బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు