Anmol Bishnio: లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ ను బహిష్కరించిన యూఎస్..భారత్ కు రప్పించే ప్రయత్నం

భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లారెన్స్ బిష్ణోయ్ తమ్మడు అన్మోల్ బిష్ణోయ్ ను అమెరికా బహిష్కరించింది. అమెరికా హోం ల్యాండ్ దీన్ని ధృవీకరించింది. దీంతో అతడిని భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

New Update
anmol

అన్మోల్ బిష్ణోయ్...తన అన్నలాగే ితను కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. గత ఏడాది ముంబైలో మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడు. అంతేకాదు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల కేసులో కూడా ఇతనే ప్రధాన నిందితుడు. 2022లో హత్యకు గురైన పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా కేసులోనూ అనుమానితుగా ఉన్నాడు. ఇతనిని గత ఫిబ్రవరిలో అమెరికాలో యూఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ అరెస్టు చేసింది. తాజాగా అన్మోల్ ను యూఎస్ బహిష్కరించింది అంటూ నిన్న అక్కడి హోం ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. దీంతో అతడిని భారత్ తీసుకువచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది అంటున్నారు అధికారులు.

భారత్, కెనడాల్లో నేరాలు..

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇండియాలోనే కాక కెనడాలో సైతం అనేక నేరాలకు పాల్పడింది. ఈ ముఠాలో కీలక సభ్యుడు లారెన్స్ బిష్ణోయ్ సోదరుడైన అన్మోల్ కూడా అనేక నేరాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అన్మోల్ పై భారత్ లో ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్ నమోదు చేసింది. బిష్ణోయ్ గ్యాంగ్ అన్మోల్ బిష్ణోయ్ ఆధ్వర్యంలో దావూద్ తరహా వ్యవస్థీకృత నేరాల సిండికేట్‌గా రూపాంతరం చెందిందని వర్గాలు తెలిపాయి. అన్మోల్ బిష్ణోయ్..దావూద్ ఇబ్రమీం తరహాలో దేశం బయట నుంచి నేర కార్యకలాపాలు కొనసాగించాడు. దాదాపు పదేళ్ళుగా ఇతనే అనేక నేరాల్లో పాల్గొన్నాడు. అంతేకాదు ఇతను ఉగ్రవాద సంస్థలకు కూడా సహాయం చేస్తున్నాడని ఎన్ఐఏ ఆరోపిస్తోంది. ఉగ్రవాద సిండికేట్ లక్ష్యంగా చేసుకున్న హత్యలు, దోపిడీ, హత్యాయత్నాల ద్వారా ఉత్తర భారతదేశంలో శాంతిభద్రతలను అస్థిరపరచాలని నిరంతరం లక్ష్యంగా  లారెన్స్ బిష్షోయ్ గ్యాంగ్ పెట్టుకుందని NIA తెలిపింది.

చిన్న నేరాలతో తమ క్రిమినల్ కార్యకలాపాలను ప్రారంభించిన లారెన్స్, అతని తమ్మడు అన్మోల్...తరువాత సొంత ముఠాను ఏర్పరచుకున్నారు. గోల్డీ బ్రార్‌లోని సతీందర్‌జిత్ సింగ్, సచిన్ థాపన్ అకా సచిన్ థాపన్ బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్, విక్రమ్‌జిత్ సింగ్ ,ఇతరుల సహాయంతో తన ముఠాను మరింత విస్తరించాడు. ప్రస్తుతం లారెన్స్ గ్యాంగ్ లో 700 మందికి పైగా ఉన్నారని తెలుస్తోంది. ఈక్రమంలో అన్మోల్ బిష్ణోయ్ పై ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది.  

ప్రస్తుతం లారెన్స్ ఎక్కడ ఉన్నాడో తెలియనప్పటికీ అతని తమ్మడిని మాత్రం అమెరికా గత ఫిబ్రవరిలో పట్టుకుంది. తాజాగా నిన్న దేశ బహిష్కరణ చేస్తున్నట్టు ప్రకటించింది. చట్టపరమైన, భద్రతా చర్యలు పూర్తి చేసిన తర్వాత.. అన్మోల్ బిష్ణోయ్‌ని ఇండియా దర్యాప్తు సంస్తలకు అప్పగిస్తామని అమెరికా అధికారులు తెలిపారు. అలానే అన్మోల్ బహిష్కరణ గురించి యూఎస్ హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం.. బాబా సిద్ధిఖీ కుమారుడు, ఎన్‌సీపీ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీకి ఈ మెయిల్ చేసింది. దీనిలో నవంబర్ 18న అన్మోల్ బిష్ణోయ్‌ను అధికారికంగా అమెరికా నుంచి బహిష్కరించినట్లు తెలిపింది. 

Also Read: Delhi Blast Update: అల్-ఫలాహ్ యూనివర్శిటీ చైర్మన్ సిద్ధిఖీ అరెస్ట్

Advertisment
తాజా కథనాలు