/rtv/media/media_files/2025/11/19/university-2025-11-19-08-27-04.jpg)
ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ళల్లో రోజుకో ట్విస్ట్ జరుగుతూనే ఉంది. దాని చుట్టూ బోలెడు మంది లింకులు దొరుకుతున్నాయి.తాజాగా పేలుళ్ళతో లింకులు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు, అల్-ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖీ అరెస్ట్ అయ్యాడు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002లోని సెక్షన్ 19 కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధిఖీని అరెస్టు అరెస్ట్ చేసింది.
యూనివర్శిటీనే ఫ్రాడ్..
ఢిల్లీ పేలుళ్ళకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ఉగ్రవాదులు అందరూ అల్ ఫలాహ్ యూనివర్శిొటీకి చెందినవారే. ఇక్కడి డాక్టర్లే ఉగ్రవాదులగా మారి బాంబు పేలుళ్ళకు కుట్ర పన్నారు. ఇక్కడి నుంచే నిందితులు దాడులకు కుట్ర చేసినట్లు ఏజెన్సీలు గుర్తించాయి. దాంతో పాటూ NAAC అక్రిడిటేషన్ లేకున్నా ఉన్నట్లుగా అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం విద్యార్థులను తప్పుదారి పట్టించినట్లు గుర్తించిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ మేరకు అల్-ఫలాహ్ యూనివర్శిటీపై రెండు కేసులు నమోదు చేశారు. అల్ ఫలాహ్ యూనివర్శిటీలో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ECIR నమోదు చేసి విచారణ ప్రారంభించింది. అల్-ఫలాహ్ యూనివర్శిటీ, చైర్మన్ సిద్ధిఖీ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. సిద్ధిఖీని అదుపులోకి తీసుకుని విచారించింది. నిధుల మళ్లింపు, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారించుకుంది. అంతేకాకుండా వీరు ఉగ్రవాదానికి కూడా నిధులు మళ్ళింపు చేశారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ళల్లో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందారు. ఇంకా కొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యావత్ దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనను ఉగ్రదాడిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి అప్పగించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. మరోవైపు కారు బాంబ్ ను తయారు చేసిన ఉగ్రవాది డానిష్ విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కంటే ముందు వీరు డ్రోన్లు, రాకెట్లతో దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. 2023లో ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడి తరహా గా దీన్ని ప్లాన్ చేశామని నిందితులు తెలిపారు. డానిష్ ను ఎన్ఐఏ శ్రీనగర్ లో అదుపులోకి తీసుకుంది. ఇతను కారు బాంబును తయారు చేసి ఇవ్వడమే కాక..అంతకు ముందు డ్రోన్లు, రాకెట్ల తయారీలో కూడా టెక్నికల్ గా సపోర్ట్ చేశాడు. కెమెరాలతో పాటు బరువైన బాంబులను మోసుకెళ్లగల పెద్ద బ్యాటరీలతో అమర్చబడిన శక్తివంతమైన డ్రోన్‌లను తయారు చేయడానికి డానిష్ ప్రయత్నించాడని ఎన్ఐఏ చెబుతోంది. అతనికి చిన్న ఆయుధ డ్రోన్లను తయారు చేయడంలో అనుభవం ఉందని తెలిపారు. జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో ఆయుధాలతో కూడానడ్రోన్లను పంపి ప్రాణ నష్టం జరిగేలా చేయాలని ప్లాన్ చేశారని..ఇలాంటి వ్యూహాన్నే అంతకు ముందు హమాస్, సిరియాల్లోని టెర్రరిస్ట్ గ్రూపులు ఉపయోగించాయని చెబుతున్నారు.
Follow Us