Mahakumbh: కుంభమేళాలో 140 సోషల్ మీడియా అకౌంట్లపై పోలీస్ కేసు.. 13 FIRలు

కుంభమేళా త్రివేణి సంగమంలో వదంతులు ప్రచారం చేసి భక్తులను తప్పుదోవ పట్టించిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. మొత్తం 140 సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి పోలీసు కేసులు నమోదు చేశారు. డిఐజి వైభవ్ కృష్ణ 13 FRI లు ఫైల్ చేశామన్నారు.

New Update
khumbmela social media

khumbmela social media Photograph: (khumbmela social media)

Mahakumbh: ప్రయాగ్‌రాజ్ కుంభమేళా మరో రెండు రోజుల్లో ముగియనుంది. త్రివేణి సంగమంలో వదంతులను ప్రచారం చేసిన, కుంభమేళాకు వచ్చిన భక్తులను తప్పుదోవ పట్టించిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. మొత్తం 140 సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి పోలీసు కేసులు నమోదు చేశారు.13 FRI లు ఫైల్ చేశారు. కుంభమేళాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై సిరియస్ యాక్షన్ తీసుకుంటామని డిఐజి వైభవ్ కృష్ణ హెచ్చరించారు.

ఫిబ్రవరి 26 శివరాత్రి, కుంభమేళా ఆఖరి రోజు కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు కుంభమేళాలకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏర్పాటు చేయడానికి అధికారులు నిమగ్నమైయ్యారు. పుణ్యస్నాలకు హాజరైయ్యే వారికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు