పదో అంతస్తు నుంచి పడి ప్రాణాలతో బయటపడ్డాడు.. వీడియో వైరల్

గుజరాత్‌లోని సూరత్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పదో అంతస్తు నుంచి కిందకి పడిన ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

New Update
Firemen save man trapped mid-air on 10th floor after fall from Surat high-rise apartment

Firemen save man trapped mid-air on 10th floor after fall from Surat high-rise apartment

గుజరాత్‌లోని సూరత్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పదో అంతస్తు నుంచి కిందకి పడిన ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌లోని జహంగిర్‌పురాకు చెందిన నితిన్‌భాయ్ అదియా (57) అనే వ్యక్తి అపార్ట్‌మెంట్‌లో పదో అంతస్తులో కిటికీ పక్కన కునుకు తీస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. 8వ అంతస్తులోని కిటికీలో అతడి కాలు ఇరుక్కుంది.      

Also Read: డిసెంబరు 31 డెడ్‌లైన్‌.. పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయకపోతే..?

దీంతో ఆ అంతస్తులో నితిన్‌భాయ్‌ తలకిందులుగా వేలాడుతూ కనిపించాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు తాడులు, సేఫ్టీ బెల్ట్‌ సాయంతో నితిన్‌ను రక్షించాయి. కిటికీ గ్రిల్స్‌ నుంచి అతడిని సురక్షితంగా బయటకు తీశాయి. దీంతో అక్కడున్న వాళ్లందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

Also Read: ఉన్నావ్‌ రేపు కేసులో ఊహించని మలుపులు.. అసలేం జరిగిందో తెలుసా ?

Advertisment
తాజా కథనాలు