Hunger strike: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

రైతు ఉద్యమ నాయకుడు జగ్జీత్ సింగ్ దల్వాల్ 131 రోజుల నిరాహార దీక్షను విరమించుకున్నాడు. కనీస మద్ధతు ధరపై చట్టం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల కోరిక మేరకు ఆయన దీక్ష విరమించారు.

New Update
farmer leadar

farmer leadar Photograph: (farmer leadar)

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఓ రైతు ఉద్యమ నాయకుడు నిరాహార దీక్ష చేశాడు. పంజాబ్‌కు చెందిన జగ్జీత్ సింగ్ దల్వాల్ 131 రోజులుగా ఏమీ తినకుండా దీక్ష చేస్తున్నాడు. 131 రోజుల తర్వాత అతను నిరాహార దీక్షను విరమించారు. పంజాబ్ రైతుల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రైతు సంఘాలను ఆయన్ని కోరాయి. రైతు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం చర్యల కోసం గత ఏడాది నవంబర్‌ 26న జగ్జీత్ సింగ్ దల్వాల్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో రైతు సంఘాలు ఆందోళన చెందాయి.

Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

ఈ నేపథ్యంలో ఫతేగఢ్‌ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్‌లో కిసాన్ మహాపంచాయత్ నిర్వహించారు. జగ్జీత్ సింగ్ దల్వాల్ నిరాహార దీక్ష ముగించాలని రైతుల సమావేశంలో కోరారు. ఈ నేపథ్యంలో శనివారం హాస్పిటల్‌ నుంచి ఇంటికి చేరుకున్న జగ్జీత్ సింగ్ దల్వాల్‌,  రైతుల విన్నపం మేరకు ఆమరణ నిరాహార దీక్షను ఆదివారం ముగించారు. మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు కూడా నిరాహార దీక్షను విరమించాలని జగ్జీత్ సింగ్ దల్వాల్‌ను శనివారం కోరారు. రైతుల డిమాండ్లపై రైతు సంఘాల ప్రతినిధులతో మే 4న కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుందని బిట్టు హామీ ఇచ్చారు.

Advertisment