Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

జనగామ జిల్లా పాలకుర్తి మండల రామాలయంలో రాములోరి కళ్యాణంలో అపశృతి చోటుచేసుకుంది. గాలిదుమారం కారణంగా టెంట్లు కూలి భక్తుల తలలు పలిగాయి. వారిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. నిజామాబాద్ ఏర్గట్ల మండలం తాల్లరాంపూర్లో కులవివక్ష వెలుగుచూసింది.

New Update
janagana incident

janagana incident Photograph: (janagana incident)

సీతారాముల కళ్యాణంలో అపశృతి.. శ్రీరామ నవమి పండగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం రామాలయం దగ్గర గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ఆలయం దగ్గర వేసిన టెంట్లు గాలిదుమారానికి కుప్పకూలిపోయాయి. కళ్యాణ మహోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన భోజనలు వితరణ చేస్తుండగా.. పెద్దగాలిదుమారం సంభవించింది. అక్కడున్న టెంట్లు కూలి భక్తులకు గాయాలయ్యాయి. ముగ్గురు భక్తులకు తలలు పగిలి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా భక్తులపై టెంట్లు కూలడంతో భక్తులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన భోజనాలు నేల పాలయ్యాయి.

Also read: Husband suicide: కాజల్ వేధింపులు.. భరించలేక భర్త లైవ్ వీడియో చేసి సూసైడ్

మరో చోట.. నిజామాబాద్ జిల్లాలో గుడిలో కుల వివక్ష ఘటన వెలుగుచూసింది. ఏర్గట్ల మండలం తాల్లరాంపూర్లో శ్రీరామ నవమి కుంకుమర్చాన పూజలకు పూజారి మహిళలను గుడిలోకి అనుమతించలేదు. గౌడ కుల మహిళలను రామాలయంలోకి రావద్దని గ్రామాభివృద్ధి కమిటీ చెప్పిందని పూజారి అన్నాడు. చేసేదేమి లేక గుడి నుంచి గౌడ మహిళలు బయటకు వచ్చారు. పోలీస్ స్టేషన్లో గౌడ కులస్తులు, మహిళలు ఫిర్యాదు చేశారు.

Also read: Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు