Digital Arrest: డిజిటల్ అరెస్టయిన కుటుంబం.. కోటి రూపాయలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

ఢిల్లీలోని నోయిడాకు చెందిన ఓ కుటుంబం 5 రోజు పాటు డిజిటల్ అరెస్టయ్యింది. సైబర్ కేటుగాళ్లు ఆ కుటుంబం నుంచి ఏకంగా రూ.కోటి కాజేశారు. చివరికీ తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.

New Update
Digital Arrest

Digital Arrest

ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా డిజిటల్ అరెస్టు కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది. తాజాగా ఢిల్లీలోని నోయిడాకు చెందిన ఓ కుటుంబం కూడా డిజిటల్ అరెస్టయ్యింది. 5 రోజుల పాటు సైబర్ కేటుగాళ్లు ఆ కుటుంబానికి చెందిన ముగ్గురిని డిజిటల్ అరెస్టు చేశారు. ఈ ఐదురోజుల్లోనే వారనుంచి ఏకంగా రూ.కోటి కాజేశారు. ప్రభుత్వ అధికారులమంటూ నమ్మబలికి మోసానికి పాల్పడ్డారు. 

Also Read: ఢిల్లీలో 27 ఏళ్ల తరువాత అధికారం.. బీజేపీ ముందున్న పది సవాళ్లు ఇవే!

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 1న చంద్రబాన్ పలివాల్ అనే వ్యక్తికి గుర్తు తెలియని నెంబర్‌ నుంచి ఫోన్ వచ్చింది. టెలికాం రెగ్యులేటరీ బోర్డుకు కాల్‌ చేయాలని లేకపోతే సిమ్ కార్డును బ్లాక్ చేస్తామని బెదిరించారు. చంద్రబాన్‌కు సంబంధించిన కేసు సైబర్ క్రైం బ్రాంచ్‌ వద్ద ఉందని చెప్పారు. 10 నిమిషాల తర్వాత మరో వ్యక్తి తాను ఐపీఎస్‌ ఆఫీసర్‌ అని వీడియో కాల్ చేశాడు. ముంబైలోని కొలావా పోలీస్ స్టేషన్‌ నుంచి కాల్ చేసినట్లు నమ్మించారు. 

Also Read: 350 కి.మీ మేర నిలిచిన ట్రాఫిక్‌...గూగుల్‌ మ్యాప్‌ చూసుకుని వెళ్లండంటున్న సీఎం!

చంద్రబాన్‌పై 24 కేసులు నమోదయ్యాయని.. ప్రస్తుతం మనీ లాండరింగ్ కోణంలో దీనిపై సీబీఐ విచారిస్తోందని ఆ నకిలీ ఆఫీసర్ చెప్పాడు. వీడియో కాల్‌ ద్వారా చంద్రబాన్‌తో పాటు అతడి భార్య, కూతురుని కూడా డిజిటల్ అరెస్టు చేశారు. తమకు కావాల్సిన డబ్బులు చెల్లించకుంటే అరెస్టు చేస్తామని బెదిరించారు. ఐదు రోజుల పాటు ఈ డిజిటల్ అరెస్టు కొనసాగింది. దీంతో ఆ కుటుంబం ఆ సైబర్ నేరగాళ్లకు రూ.1.10 కోట్లు చెల్లించినట్లు చెల్లించింది. చివరికి తాము మోసపోయామని తెలుసుకున్నాక చందరబాల్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

Also Read: నీళ్ళు, ఇళ్ళు లేక చాలా మంది ఉంటే..మీకు సైకిల్ ట్రాక్ కావాలా..సుప్రీంకోర్టు ఆగ్రహం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు