ఇజ్రాయిల్, హెజ్‌బుల్లా మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో హెజ్‌బుల్లా సంస్థకు చెందిన కమ్యూనికేషన్ పరికరాలు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో ఆ పరికరాలను ఆపరేట్ చేస్తున్న దాదాపు 1000 మంది గాయాలపాలనైట్లు అరబ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో పేజర్లు, రేడియోలు పేలిపోయాయని.. గాయాలపాలైన వారి సంఖ్య మరింత ఎక్కువగానే ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఇజ్రాయెల్ తమ డివైజ్‌లను హ్యాకింగ్ చేయడం వల్లే అవి పేలిపోయానని లెబనాన్‌కు చెందిన వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలపై ఇజ్రాయెల్ ఇంతవరకు స్పందించలేదు.
లెబనాన్ మాత్రమే కాదు సిరియాలో కూడా కమ్యూనికేషన్ పరికరాలు ఆపరేట్ చేసే చోట ఇలాంటి పేలుళ్లే జరిగాయని పలువురు హెజ్‌బుల్లా వాసులు గాయాలపాలైనట్లు కథనాలు వస్తున్నాయి. డివైజ్‌లు పేలిపోవడం.. ఆ తర్వాత లెబనీస్ ఆస్పత్రుల్లో గందరగోళం నెలకొనడం లాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది ఇజ్రాయెల్ వాళ్ల సైబర్ దాడే అని ఓ అరబ్ మీడియా కూడా ఆరోపణలు చేసింది. ఇదిలాఉండగా సోమవారం రాత్రి ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో కేబినేట్.. ఇతర యుద్ధ లక్ష్యాలతో పాటు 60 వేల మంది ఇజ్రాయెల్ వాసుల్ని వాళ్ల ఇళ్లకు సురక్షితంగా చేర్చడాన్ని కూడా లక్ష్యంగా పెట్టుకోవాలని తమ అధికారులకు ఆదేశించింది.
Also Read: క్యాస్టింగ్ కౌచ్ నీచులను కాపాడేది సిని'మా' పెద్దలేనా?
Drone Attack
గత ఏడాది అక్టోబర్‌లో హెజ్‌బుల్లా.. ఇజ్రాయెల్ (Israel) పై రాకేట్లు, డ్రోన్లతో దాడులు చేసినప్పుడు లెబనాన్ సరిహద్దు వద్ద ఉన్న దాదాపు 60 వేల మంది ఉత్తరాది ఇజ్రాయెల్ ప్రజలు బలవంతంగా వారి ఇళ్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. అంతేకాదు ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ల సొంతింటికి వెళ్లకుండా తాము దాడులు చేస్తూనే ఉంటామని హెజ్‌బుల్లా నాయకులు కూడా ప్రకటించారు. అయితే ఇజ్రాయెల్‌పై ఈ దాడులు జరిగినప్పడు అక్కడ 26 మంది పౌరులు, 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆగస్టులో ఉత్తర ఇజ్రాయెల్ వద్ద హెజ్‌బుల్లా దాదాపు1,307 రాకెట్లతో విరుచుకుపడినట్లు ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు హెజ్‌బుల్లా 6,700 లకు పైగా రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేసింది.
ఇదిలాఉండగా గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్, హమాస్ (Hamas) మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. అలాగే హెజ్‌బుల్లా సైతం ఇజ్రాయెల్‌తో దాడులు కొనసాగిస్తోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం.. హమాస్ మిలటరీని అంతం చేయడం, నిర్బంధంలో ఉన్న తమ ప్రజల్ని తిరిగి స్వదేశానికి తీసుకురావడం అలాగే గాజా వల్ల ఇజ్రాయెల్‌కు ఇక ఎలాంటి మప్పు ఉండకుండా చేయాలనే లక్ష్యాలతో ముందుకెళ్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో హమాస్ ఇజ్రాయెల్‌పై రాకెట్లతో మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసింది. ఆ దాడుల్లో దాదాపు 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 252 మంది ఇజ్రాయెల్, విదేశీయులను హమాస్ ఉగ్రవాదులు నిర్బంధించారు. యుద్ధం ఆపాలని శాంతి చర్చలు కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవి ఫలించడం లేదు. దీంతో అక్కడి ప్రజలు ప్రతిరోజూ బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.
Also Read: మీడియా ముందుకు వెళ్ళకండి..మాకు చెప్పండి– మా