BIG BREAKING: పుల్వామాలో ఎదురు కాల్పులు

జమ్మూ, కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా ట్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భారత్ భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కూడా ఇక్కడే కాల్పులు జరగ్గా ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. 48 గంటల్లో ఇది రెండో ఎన్ కౌంటర్.

author-image
By Manogna alamuru
New Update
Pulwama Encounter: పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాదళాలు..!!

జమ్మూ, కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. యుద్ధం తరువాత కూడా ఆక్రమణలకు, కాల్పులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఈరోజు ఉదయమే ఉగ్రవాదులు దాడులు జరిపారు. వీటిని భారత భద్రతా బలగాలు సమర్ధవంతంగా అడ్డుకుంటున్నాయి. ప్రస్తుతం ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పుల్వామా జిల్లా ట్రాల్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. రెండు రోజులు క్రితం కూడా ఇక్కడే ఉగ్రవాదులకు, భారత భద్రతా బలగాలకు భీకర కాల్పులు జరిగాయి. అందులో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. 

 

 

 today-latest-news-in-telugu | jammu-kashmir | terrorists | Pulwama 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు