దారుణం.. చిరుత దాడిలో 8 ఏళ్ల చిన్నారి మృతి

యూపీలో పశుగ్రాసం తెచ్చేందుకు తల్లితో కలిసి దగ్గర్లోని ఓ అటవీ ప్రాంతానికి వెళ్లిన చిన్నారి (8)పై చిరుత దాడి చేసి ఈడ్చుకెళ్లింది. గ్రామస్తులు ఆ చిరుతను తరిమేశాక చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

New Update
Leopard

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో చిరుత పులుల దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని చిరుతపులి దాడిలో మరో చిన్నారి మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బిజ్నోర్ జిల్లాలోని మల్కాపూర్‌ గ్రామంలో తాన్య(8) అనే చిన్నారి పశుగ్రాసం తెచ్చేందుకు తల్లితో కలిసి దగ్గర్లోని ఓ అటవీ ప్రాంతానికి వెళ్లింది. అయితే అక్కడున్న చిరుత ఒక్కసారిగా ఆ బాలికపై దాడి చేసి ఈడ్చుకెళ్లింది. దీంతో చిన్నారి తల్లి, ఇతర గ్రామస్థులు ఆ చిరుతను కర్రలతో తరిమేశారు.

Also Read: యుద్ధాల నుంచి రక్షణ కోసం అణు బంకర్లకు పెరుగుతున్న డిమాండ్..

 ఆ చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరిలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తీవ్ర గాయాలపాలైన బాలిక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం మేరకు పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. చిరుతను గుర్తించేందుకు కెమెరా ట్రాప్‌లు, థర్మల్‌ డ్రోన్‌లను వినియోగిస్తున్నట్లు ఫారెస్ట్ డివిజన్ అధికారి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.        

Advertisment
Advertisment
తాజా కథనాలు