Haryana Elections: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయడంలో కేంద్ర ఎన్నికల సంఘం జాప్యం చేస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల సమయంలో జరిగినట్లుగానే.. కాలం చెల్లిన, తప్పుదోవ పట్టించే ట్రెండ్స్‌ను పంచుకుంటూ యంత్రాంగంపై బీజేపీ ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నిస్తోందా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అయితే ఆయన ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారిసింది.
Also Read: కొంపముంచిన కాంగ్రెస్ అతివిశ్వాసం.. ఓటమికి ముఖ్య కారణాలివే
లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలే చేసిందని పేర్కొంది. ఓట్ల లెక్కింపు అనేది అభ్యర్థులు, కమిషన్ నామినేట్ చేసిన అధికారుల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపింది. అన్ని నియోజకవర్గాల్లోని దాదాపు 25 రౌండ్లలో ప్రతీ 5 నిమిషాలకు ఒకసారి అప్‌డేట్ చేస్తున్నామని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారమే ఓట్ల కౌంటింగ్ జరగుతోందని పేర్కొంది. డేటా అప్‌డేట్‌లో జాప్యానికి సంబంధించిన చేసిన ఆరోపణలను కమిషన్ తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది.