/rtv/media/media_files/2025/07/04/doctors-in-odisha-2025-07-04-18-57-57.jpg)
Private Hospital Scam:
మణిపూర్ రాష్ట్రం జిరిబామ్ జిల్లాకు చెందిన అటికూర్ రెహ్మాన్‌కు జననావయవాల్లో ఇన్‌ఫెక్షన్ సోకడంతో చికిత్స కోసం అసోం రాష్ట్రం సిల్చార్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. పరిశీలించిన వైద్యులు బయాప్సీ పరీక్ష చేయించారు. రిపోర్టు వచ్చిన తర్వాత సర్జరీ చేయాల్సి ఉంటుందని రెహ్మాన్‌కు చెప్పారు. ఇన్‌ఫెక్షన్ తొలగించే సర్జరీ అనుకుని రెహ్మన్ ఒకే చెప్పాడు. రిపోర్టు వచ్చిన తర్వాత సర్జరీ చేసి పేషెంట్ ప్రైవేట్ పార్ట్ తొలగించారు. సర్జరీ అనంతరం మత్తు నుంచి తేరుకున్న బాధితుడు జననాంగాలను తొలగించిన విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నాడు.
Also Read:Tamannaah Bhatia: రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ.. స్టిల్స్ పిచ్చేక్కించేసిందిగా!
సర్జరీ అనంతరం మత్తు నుంచి తేరుకున్న రెహ్మాన్ తన జననాంగాలను తొలగించిన విషయాన్ని గ్రహించాడు. దీనిపై వైద్యులను నిలదీయగా డాక్టర్లు పొంతన లేని సమాధానాలు చెప్పారు. దాంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా తనకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని బాధితుడు అసోం సీఎం హిమాంత బిశ్వశర్మకు మీడియా ద్వారా మొరపెట్టుకున్నాడు.
Also Read: కెచప్‌తో రోటీ పరోటా పిల్లలకు ఇస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?