/rtv/media/media_files/2025/11/13/delhi-blast-2025-11-13-07-22-31.jpg)
ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు పేలుడులో డాక్టర్ హ్యాండ్లర్ ఉమర్ నబీ పేరు వెలుగులోకి వచ్చింది. అక్కడ పేలిన కారును ఉమర్ నుడుపుతునట్టు ఆధారాలు బయటపడ్డాయి. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఉమర్ ను గుర్తించారు. ఇతనికి ఉగ్రవాద ముఠాతో సబంధాలు ఉన్నట్టు కూడా తెలిసింది. ఫరీదాబాద్ లో పట్టుబడ్డ ఉగ్రవాదులకు, ఉమర్ కు సంబంధాలు ఉన్నాయని..ఇతను కూడా అక్కడ నుంచే పారిపోయి వచ్చీ ఢిల్లీలో పేలుడుకి పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఎర్రకోట దగ్గర బాంబు పేలుడులో ఉమర్ మరణించి ఉంటాడని అధికారులు అనుమానించారు. కారు నడిపింది అతనే కాబట్టి ఉమర్ కచ్చితంగా చనిపోయాడని చెప్పారు. దీనిని కన్ఫార్మ్ చేసుకునేందుకు పుల్వామాలో ఉన్న అతని తల్లి దగ్గర నుంచి డీఎన్ఏ నమూనాలను తీసుకుని పరీక్షించారు. తాజాగా కారు నుంచి లభ్యమైన డీఎన్‌ఏ ఉమర్ నబీదేనని తేలినట్లు తెలుస్తోంది. దీంతో పేలుడు జరిగే సమయానికి అతడు వాహనంలోనే ఉన్నాడని అధికారులు నిర్ధరించినట్లు తెలుస్తోంది.
ఉగ్రదాడే..నిర్థారించిన కేంద్రం
ఇక ఢిల్లీ కారు బాంబు పేలుడు ఘటన ఉగ్రవాదులచర్యేనని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కేబినెట్ సమావేశంతో పాటు కేంద్ర భద్రతా మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో ఎర్రకోట పేలుళ్లు,ఉగ్రవాద నిర్మూలనపై ప్రత్యేక చర్చ జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా పెలుడు ఘటన మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్.. మృతులకు సంతాపం తెలిపింది. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని కేంద్ర కేబినెట్ తీర్మానించింది. ఉగ్రవాదాన్ని జీరో టోలరెన్స్ విధానంతో అణిచివేస్తామని కేబినెట్ కీలక ప్రకటన చేసింది. ఘటనకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టి.. శిక్షిస్తామని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై కేంద్ర నిఘా వర్గాలు కీలక ప్రాథమిక అంచనాను విడుదల చేశాయి. ఇది ఉగ్రదాడే అయినప్పటికీ పక్కాగా ప్లాన్ చేసినది కాదని చెబుతున్నారు. దీని కంటే పెద్ద బ్లాస్టర్ ను చేయాలని ప్లాన్ చేశారని...కానీ హర్యానాలోని ఫరీదాబాద్‌లో 2,900 కిలోల భారీ పేలుడు రసాయనాలను స్వాధీనం చేసుకోవడం వంటి పరిణామాలు నిందితుల్లో భయాన్ని సృష్టించాయని.. ఈక్రమంలో పేలుడు పదార్ధాలను వదిలించుకోవాలని లేదా తరలించడంలో బాంబ్ బ్లాస్టర్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Also Read: Pak-Sri lanka: బాబోయ్ మేమిక్కడ ఆడలేం..స్వదేశానికి బయలుదేరిన శ్రీలంక ఆటగాళ్ళు
Follow Us