Waqf Act : వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకు డీఎంకే

వక్ఫ్ సవరణ చట్టం-2025ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అవుతూనే ఉన్నాయి. తాజాగా, డీఎంకే పార్టీ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. డీఎంకే ఎంపీ ఏ రాజా పిటిషన్ దాఖలు చేశారు. 20 కోట్ల మంది ముస్లింల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందన్నారు.

New Update
Supreme Court

Supreme Court

Waqf Act: వక్ఫ్ సవరణ చట్టం-2025ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌కి చెందిన ఎంపీ మొహమ్మద్ జావెద్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీలు పిటిషన్లు దాఖలు చేయగా, పలు పార్టీలు కూడా పిటిషన్లు వేస్తున్నాయి. ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా, డీఎంకే పార్టీ కూడా వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. డీఎంకే ఎంపీ ఏ రాజా పార్టీ తరుపున పిటిషన్ దాఖలు చేశారు. వక్ఫ్ చట్టంపై పలువురు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. అయితే, అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది.

Also read: Varanasi gang rape: ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్స్ యువతికి మత్తుమందు ఇచ్చి.. 23 మంది గ్యాంగ్‌రేప్

మరోవైపు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(AIMPLB) కూడా వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఈ సంస్థ ప్రతినిధి ఎస్‌క్యూఆర్ ఇలియాస్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ సవరణలు ఏకపక్షంగా, వివక్షతో కూడుకున్నవని పిటిషన్‌లో పేర్కొన్నట్లు చెప్పారు. ఈ చట్టాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 కింద ఉన్న ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించడమే అని , వక్ఫ్‌ని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవాలనే ఉద్దేశం స్పష్టంగా ఉందని, ముస్లిం మైనారిటీలు తమ సొంత మతపరమైన నిధులను వినియోగించకుండా అడ్డుకుంటుందని పిటిషన్ పేర్కొంది. కొత్తగా అమలులోకి వచ్చి వక్ఫ్ చట్టం ముస్లింల ప్రాథమిక హక్కులను తొలగిస్తుందని పిటిషన్ పేర్కొంది. ఈ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25లతో పాటు ఇస్లామిక్ షరియా సూత్రాలకు విరుద్ధంగా ఉందని ముస్లిం లా బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.

Also read: Mamata Banerjee: త్వరలోనే నన్ను అరెస్ట్ చేసి జైళ్లో వేస్తారు.. మమతా బెనర్జీ సంచలన కామెంట్స్

కాగా వక్ఫ్ సవరణ చట్టం తమిళనాడులోని 50 లక్షల మంది ముస్లింలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని 20 కోట్ల మంది ముస్లింల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని డీఎంకే ఎంపీ ఎ.రాజా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.. లోక్‌సభ ఎంపీ అయిన ఎ.రాజా.. వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ మాజీ సభ్యుడిగా కూడా ఉన్నారు. వక్ఫ్ సవరణ చట్టం తమిళనాడులోని 50 లక్షల మంది ముస్లింలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని 20 కోట్ల మంది ముస్లింల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని తన పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు.

వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

కాగా, పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 5న ఆమోదముద్ర వేశారు. రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. లోక్‌సభలో 288 మంది సభ్యులు అనూకూలంగా ఓటు వేయగా, 232 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఉభయసభల్లోనూ బిల్లు ఆమోదం పొందడం, రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో బిల్లు చట్టరూపం సంతరించుకుంది.

Also read : ఏడడుగుల కండక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి బంపరాఫర్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు