Indian Armed Forces Salutes: ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ - వేర్వేరు సెల్యూట్ లు ఎందుకు ఉన్నాయో తెలుసా?

భారతదేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వేర్వేరు సెల్యూట్ విధానాన్ని పాటిస్తాయి. ఇవి వారి చరిత్ర, పని లోని పరిస్థితులు, గౌరవ సూచనలపై ఆధారపడి ఉంటాయి. ప్రతి సెల్యూట్ శైలి వారి ప్రత్యేకతను, డిసిప్లిన్‌ను, అధికార గౌరవాన్ని తెలుపుతాయి.

New Update
Indian Armed Forces Salutes

Indian Armed Forces Salutes

Indian Armed Forces Salutes: భారతదేశ రక్షణ వ్యవస్థను ఆధారంగా నిలిపే మూడు ముఖ్యమైన విభాగాలు - ఇండియన్ ఆర్మీ(Indian Army), నేవీ(Indian Navy), ఎయిర్ ఫోర్స్(Indian Air Force). ఇవి దేశ భద్రతను కాపాడటంలో సమన్వయంతో పనిచేస్తూ, తమ ప్రత్యేక సంప్రదాయాలను గౌరవిస్తూ, వేర్వేరు సెల్యూట్ విధానాలను అనుసరిస్తున్నాయి.

Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

సెల్యూట్ అనేది ఒక్క గౌరవ సూచక..  సూచిక మాత్రమే కాదు, ఇది సైన్యంలో డిసిప్లిన్, పని పట్ల అంకితభావం, అధికారాన్ని గుర్తించడానికీ ఒక ప్రత్యేక సంకేతం. సాధారణంగా మనకి ఈ సెల్యూట్ అనేది స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ ఉత్సవాలలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మూడు దళాలు వేర్వేరు రకాలుగా సల్యూట్ చేయడం వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయి.

Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

ఇండియన్ ఆర్మీ సెల్యూట్

ఇండియన్ ఆర్మీ సెల్యూట్ ఓపెన్ హ్యాండ్‌తో, తల ముందు భాగానికి అడ్డంగా చూపుతూ ఉంటుంది. వ్రేళ్లు, బొటనవేళ్లను కలిపి ఉంచి, మధ్య వ్రేలు క్యాప్ బ్యాండ్‌ను తాకేలా చేస్తారు. ఇది అధికారం, శాంతిని చూపించే విధంగా రూపొందించారు. అధికారుల గౌరవాన్ని గుర్తుచేస్తూ ఈ సెల్యూట్ ప్రతేయకంగా నిలుస్తుంది.

ఇండియన్ నేవీ సెల్యూట్

నేవీ సెల్యూట్ ప్రత్యేకత ఏమిటంటే, చేతిలోని పామ్ భాగాన్ని నేలవైపు చూపించేలా సెల్యూట్ చేస్తారు. ఇది పూర్వ కాలంలో నేవీ సిబ్బంది నౌకలపై పని చేస్తున్నప్పుడు, అక్కడి పరిస్థితులు, వాతావరణం వల్ల చేతులకు నూనె, ధూళి వంటివి అధికంగా అంటుకునేవి,  అలంటి పరిస్థితుల్లో సెల్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు  అసౌకర్యం లేకుండా ఉండేందుకు ఆ రకంగా అరచేతిలోని పామ్ భాగాన్ని నేలవైపు చూపించేలా సెల్యూట్ చేస్తారు . అందుకే చేతిని కిందివైపు తిప్పి సెల్యూట్ చేయడం ఇండియన్ నేవీ సిబ్బందికి సంప్రదాయంగా మారింది.

Also Read: Pakistan: ''మా ప్రధాని పిరికివాడు''.. పాకిస్థాన్ ఎంపీ ఫైర్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెల్యూట్

ఎయిర్ ఫోర్స్‌ సెల్యూట్ ఓపెన్ హ్యాండ్‌తో, భూమికి 45° కోణంలో ఉంటుంది. 2006 మార్చి 15న, ఎయిర్ ఫోర్స్ తమ ప్రత్యేకతను చాటేందుకు కొత్త సెల్యూట్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇది విమానాల నేచురల్ టేకాఫ్ యాంగిల్ ను సూచిస్తూ, ఎయిర్ ఫోర్స్ ఉత్సాహాన్ని, అత్యంత ఎత్తులో ఎగిరే ఎయిర్ ఫోర్స్ విమానాలకు ప్రతిబింబంలా నిలుస్తుంది. ఈ విధంగా మూడు దళాలు వేర్వేరు సెల్యూట్ విధానాలను అనుసరిస్తూ తమ తమ చరిత్ర, పని విధానం, గౌరవ చిహ్నంగా తమ ప్రత్యేకతను చూపిస్తాయి. సెల్యూట్ లాగానే సైన్యంలో ప్రతి సంకేతానికి ఒక అర్థం ఉంటుంది. అది వారి వారి విభాగంలోని గౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు