Flight Accident: అమెరికాలోని కెంటకీలో పేలిన విమానం..ముగ్గురు మృతి, 11 మంది గాయాలు

అమెరికాలోని లూయిస్ విల్లే ఎయిర్ పోర్ట్ సమీపంలో భారీ విమాన ప్రమాదం జరిగింది. బయలుదేరిన కొద్దిసేపటికే కార్గో ఫ్లైట్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా..మరో 11 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

New Update
flight

అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం లూయిస్‌విల్లేలోనిముహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న యుపిఎస్ కార్గో విమానం కూలిపోయి పేలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా..మరో 11 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గురైన విమానం హోనులూలుకువెళుతోంది. సాయంత్రం 5:15 గంటల ప్రాంతంలో కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

పెద్ద శబ్దం, భారీ మంటలు..

విమానం ఎగరడానికి ముందే దాని ఎడమ రెక్క నుంచి మంటలు వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో కనిపించాయి. దాని తరువాత ఫ్లైట్ కిందపడిపోయి కూలిపోయింది. నేలను ఢీకొన్న వెంటనే పెద్ద శబ్దంతో పాటూ, ఎగిసిన మంటలు, దట్టమైన పొగ కమ్మకున్నాయి. విమానం కొద్దిసేపు నేల నుండి లేచి రన్‌వేపైకి దూసుకెళ్లి భారీ అగ్నిగోళంగా విస్ఫోటనం చెందింది. విమానం కింద పడడంతో దగ్గరలో ఉన్న ఒక భవనం పైకప్పు పూర్తిగా దెబ్బ తింది. ఫ్లైట్ కూలిపోయిన చోట రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కెంటకీ గవర్నర్ చెప్పారు. ప్రమాద స్థలం UPS యొక్క అతిపెద్ద ఎయిర్ హబ్‌కు సమీపంలో ఉంది. ఇక్కడ నుంచి రోజుకు 300 విమానాలను నడుపుతారు. గంటకు 400,000 కంటే ఎక్కువ ప్యాకేజీలను క్రమబద్ధీకరించే విశాలమైన లాజిస్టిక్స్ కేంద్రం ఇది. వేలాది మంది ఉద్యోగులు ఈ ఆఫీసులో పనిచేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు