Jharkhand Elections: ఝార్ఖండ్ లో చక్రం తిప్పుతున్న భట్టి విక్రమార్క

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఝార్ఖండ్ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై సీఎం హేమంత్ సొరేన్‌తో సమావేశంపై చర్చించారు. కాగా ఝార్ఖండ్ ఎన్నికల బాధ్యతలను భట్టికి కాంగ్రెస్ హైకమాండ్ అప్పగించిన సంగతి తెలిసిందే.

New Update
BHATTI HEMANTH

Bhatti Vikramarka: దేశ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల నేతలు చక్రం తిప్పుతున్నారంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికలు.. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ నేతలు ఆయా రాష్ట్రాల్లో ప్రచారాలు జోరుగా సాగించారు. కాగా తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఝార్ఖండ్ ఎన్నికల్లో చక్రం తిప్పారు. అక్కడ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవరించారు. అయితే.. కాంగ్రెస్ హైకమాండ్ భట్టి విక్రమార్కకు ఝార్ఖండ్ ఎన్నికల బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో హైకమాండ్ ఇచ్చిన బాధ్యతలు తన భుజాలపై వేసుకొని పని చేసిన భట్టికి ఎన్నికల ఫలితాలు భారీ పడిన కష్టానికి ఫలితాలను అందించాయి.

ప్రభుత్వ ఏర్పాటులో భట్టి  కీలకం!..

ఝార్ఖండ్ ఎన్నికల్లో ఇండియా కూటమి భారీ విజయాన్ని సాదించడంతో కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్ కు జార్ఖండ్ కు పరిశీలకులుగా ఏఐసీసీ నియమించిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తారిఖ్ అన్వర్, కృష్ణ అల్లవూరితో పాటు ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ రాజేష్ ఠాకూర్ పాల్గొన్నారు. అనంతరం సీఎం హేమంత్ సొరేన్ నివాసానికి వెళ్లి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. కాగా జార్ఖండ్ లో జేఎంఎం, కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా?

ఇది కూడా చూడండి:  హాయ్ .. హలో అంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే న్యూడ్ వీడియో!

ఎన్నికల ఫలితాలు...

publive-image

ఇది కూడా చూడండి: TMC: బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ హవా.. బీజేపీ కంచుకోట బద్ధలు!

ఇది కూడా చూడండి:  మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు