/rtv/media/media_files/2025/02/09/0melHqF51kCJEavCN0Y4.jpeg)
Delhi's Grand Swearing-In Likely After PM Modi Returns From US
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సంగతి తెలిసిందే. మరీ సీఎం అభ్యర్థి ఎవరు ? ప్రమాణస్వీకారం ఎప్పుడు ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే దీనిపై చర్చలు జరిపేందుకు హైకమాండ్ సిద్ధమైనట్లు అధికారిక వర్గాలు చెప్పాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కీలక నేతలు ఆదివారం భేటీ కానున్నారు.
Also Read: ఢిల్లీ బీజేపీ మాజీ సీఎంలు వీళ్లే.. ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు!
అయితే ఢిల్లీ సీఎం రేసులో మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కొడుకు పర్వేశ్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, వీరేంద్ర సచ్‌దేవ, సతీశ్ ఉపాధ్యాయ్ తదితరులు సీఎం రేసులో ఉన్నారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలాఉండగా.. ప్రధాని మోదీ ఈ నెల 10 నుంచి 13 వరకు ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. అవి ముగించుకొని తిరిగి వచ్చాకే ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Also Read: మెక్సికోలో విషాదం.. బస్సు-ట్రక్కు ఢీ.. 41 మంది సజీవ దహనం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. ఆప్ కేవలం 22 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ వరుసగా మూడోసారి కూడా ఖాతా తెరవలేదు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ లాంటి బడా నేతలు కూడా ఓడిపోయారు. సీఎ అతిషి మాత్రం కాల్కాజీ స్థానం నుంచి విజయం సాధించారు.
Also Read: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్
Also Read: ఇద్దరూ జైలుకెళ్లారు..సోరెన్ మళ్ళీ సీఎం అయ్యారు..కేజ్రీవాల్ అవ్వలేదు..ఎక్కడ తేడా కొట్టింది