Kejriwal: కేజ్రీవాల్‌ కి మరో భారీ షాక్‌!

కేజ్రీవాల్‌కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. మద్యం పాలసీ కుంభకోణంలో ఆయనను విచారించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులకు అనుమతి వచ్చింది. ఈ మేరకు ఢిల్లీ లెప్టినెంట్ జనరల్ వినయ్ కుమార్ సక్సేనా ఈడీకి అనుమతులను మంజూరు చేశారు.

New Update
Kejriwal 2

Kejriwal: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది ఢిల్లీ. ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. షెడ్యూల్‌ రూపకల్పనపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి . ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ జెండా పాతింది. అప్పటి నుంచి కూడా ఆప్‌ హవానే కొనసాగుతుంది.

Also Read: Ap: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా మద్యం ధరలు తగ్గింపు

 1998లో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది. 2013లో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది అప్పటి నుంచీ ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతున్నారు ఢిల్లీ ఓటర్లు. ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి కాంగ్రెస్‌,బీజేపీ. ఈసారి కూడా ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ రెడీ అవుతుంది. వరుసగా మూడోసారి అధికారాన్ని అందుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. 

Also Read: డిసెంబర్ 21న ఆకాశంలో అద్భుతమైన వింత.. అస్సలు మిస్ అవ్వకండి..!

ఈ క్రమంలో కేజ్రీవాల్ ఇదివరకే పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. మద్యం పాలసీ కుంభకోణంలో ఆయనను విచారించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులకు అనుమతి వచ్చింది. ఈ మేరకు ఢిల్లీ లెప్టినెంట్ జనరల్ వినయ్ కుమార్ సక్సేనా ఈడీకి అనుమతులను మంజూరు చేశారు.

Also Read: Jobs: ఆ రంగంలో 5 కోట్ల జాబ్స్.. కేంద్ర మంత్రి అదిరిపోయే శుభవార్త!

దీనిపై ఆప్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. ఎల్జీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కావాలనే రాజకీయంగా కక్షసాధింపు చర్యలు చేపట్టడంలో భాగంగా ఎల్జీ వీకే సక్సేనా ఈ ఈడీ ప్రతిపాదనలపై ఆమోదం తెలిపారని ఆరోపిస్తుంది. 

Also Read: 'భారతీ.. ట్యూషన్‌ ఫీజు కట్టావా'.. అబ్బా! ఈగ సినిమా లెవెల్లో రాజమౌళి ఫస్ట్ లవ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు