'భారతీ.. ట్యూషన్‌ ఫీజు కట్టావా'.. అబ్బా! ఈగ సినిమా లెవెల్లో రాజమౌళి ఫస్ట్ లవ్

డైరెక్టర్ రాజమౌళి ఇటీవలే పాల్గొన్న 'ది రానా దగ్గుబాటి' షోలో తన ఫస్ట్ లవ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఓ అమ్మాయి అంటే తనకు చాలా ఇష్టమట. కానీ ఆ అమ్మాయితో భయంగా ఉండేదని చెప్పారు.

New Update
rajamouli1

rajamouli1 Photograph: (rajamouli1)

S. S. Rajamouli: టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్ వ్యవహరిస్తున్న లేటెస్ట్ టాక్ షో  'ది రానా దగ్గుబాటి'. సెలెబ్రెటీ గెస్టులు, వారి ముచ్చట్లతో సరదా సరదాగా సాగుతోంది ఈ షో.  తాజాగా ఈ టాక్ షోలో దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి పాల్గొన్నారు. ఇందులో భాగంగా కెరీర్, వ్యక్తిగతానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో రాజమౌళి తన 'ఫస్ట్ లవ్'  గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. 

ఇది కూడా చూడండి:  తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

 'భారతీ.. ట్యూషన్ ఫీజు కట్టావా'.. 

 రాజమౌళి మాట్లాడుతూ.. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా క్లాస్ లో ఓ అమ్మాయి ఉండేది. తాను అంటే నాకు చాలా ఇష్టం.. కానీ మాట్లాడాలంటే భయంగా ఉండేది. ఈ విషయం మా క్లాసులో అబ్బాయిలందరికీ తెలుసు.. ఈ విషయమై నన్ను ఏడిపించేవారు కూడా. ఏడాది మొత్తంలో చాలా కష్టం మీద ఆమెతో ఒకే ఒకసారి మాట్లాడాను. నా ముందు బెంచ్ లో కూర్చునేది. అయితే ఒకరోజు ఆ అమ్మాయిని 'భారతీ.. ట్యూషన్ ఫీజు కట్టావా' అని అడిగాను. అప్పుడు ఆమె వెనక్కి తిరిగిన చూసిన తీరు ఇప్పటికీ మర్చిపోలేను. భారతీ అని పిలవగానే.. ఎంతో కాలంగా నీ  పిలుపు కోసం ఎదురు చూస్తున్నా.. అన్నట్లుగా చూసింది. 

ఇది కూడా చూడండి: దారుణం.. క్రిస్మస్ వేడుకలలో టెర్రరిస్ట్ ఎటాక్.. 15 మంది మృతి!

నాని- సమంతలానే 

కానీ.. నేను ట్యూషన్ ఫీజు కట్టావా అని అడిగేసరికి తన మోహంలో ఏదో తెలియని నిరాశ కనిపించింది. ఇది ఆగడడానికి పిలిచావా..? అన్నట్లుగా చూసి తల ఊపి అటు తిరిగింది. ఆ హావభావాలను ఇప్పటికీ నేను మర్చిపోలేను. 'ఈగ' మూవీలో నాని, సమంత మధ్య కూడా  ఇలాంటి సన్నివేశాలే ఉంటాయి.  చాలా మంది డైరెక్టర్స్ తమ అనుభవాలను ఇలా స్క్రీన్ పైకి తీసుకొస్తారు అంటూ తన ఫస్ట్ లవ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు రాజమౌళి. 

ఇది కూడా చూడండి: ఆ లీక్డ్ ఫొటోతో ఎలాంటి సంబంధం లేదు.. నిధి ఇన్‏స్టా పోస్ట్ వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు