/rtv/media/media_files/2025/09/12/delhi-high-court-gets-bomb-threat-via-email-2025-09-12-14-10-02.jpg)
Delhi High Court gets bomb threat via email
ఈ మధ్య బాంబు బెదిరింపు ఈమెయిళ్లు వస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. స్కూళ్లు, కంపెనీలు, ఎయిర్‌పోర్టుల్లో బాంబులు పెట్టామంటూ కొందరు ఆకతాయిలు ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఢిల్లీ హైకోర్టులో కూడా బాంబు పెట్టామంటూ కొందకు ఆకతాయిలు మెయిల్ పంపించారు. కోర్టు లోపల మూడు బాంబులు పెట్టామని.. వెంటనే ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా సిబ్బంది.. లాయర్లు, జడ్జిలతో సహా అందరినీ అక్కడి నుంచి పంపించేశారు. సమాచారం మేరకు కోర్టుకు చేరుకున్న బాంబు స్క్వాడ్ బృందం అక్కడ మొత్తం సెర్చ్ చేసింది. కానీ ఎలాంటి అనుమానపు వస్తువు కనిపించలేదు.
Also Read: నేపాల్లో జెన్ జీ ఉద్యమానికి కారణమైన నెపో కిడ్స్..వారి సోషల్ మీడియా పోస్ట్ లు
ఈ సంఘటన జరిగన తర్వాత బాంబే హైకోర్టుకు కూడా బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో కోర్టు ప్రాంగణంలో అందరినీ బయటకు పంపించేశారు. ముంబై పోలీసు విభాగాలు, బాంబు స్క్వాడ్ బృందం ఘటనాస్థలానికి చేరుకుని అక్కడ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫేక్ బాంబు బెదిరింపు ఈమెయిళ్లు పెరిగిపోయాయి. పోలీసులు చర్యలు తీసుకుంటున్నా కూడా ఇవి ఆగడం లేదు.
Also Read: ఎలోన్ మస్క్ నంబర్ వన్ స్థానాన్ని లాగేసుకున్న 81 ఏళ్ళ వ్యక్తి..అతనెవరో తెలుసా?