ఇలా తింటున్నారేంట్రా బాబు.. ప్రతి సెకన్‌కు 2 బిర్యానీలు ఆర్డర్

ప్రతి సెకన్‌కు 2 బిర్యానీలు స్విగ్గిలో ఆర్డర్ అవుతున్నట్లు ఆ కంపెనీ 2024 యానువల్ రిపోర్ట్‌లో వెల్లడించింది. బుక్కైయిన ఆర్డర్స్ కోసం డెలివరీ బాయ్స్ 1.96 బిలియన్ కి. మీటర్లు ప్రయాణించారట. ఈ ఏడాది 215 మిలియన్ ఆర్డర్స్ వచ్చాయని స్విగ్గి యాప్ తెలిపింది.

New Update
Year End 2023 : ఒక వ్యక్తి  ఈ ఏడాది స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసిన డబ్బుతో డబుల్ బెడ్రూం కొనచ్చట.. ఎలానో తెలుసా?

2024 ఈయర్ మొత్తం మీద ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ చేసిన ఆర్డర్స్ వివరాలను విడుదల చేసింది. స్విగ్గీ డెలివరీ బాయ్స్ ట్రావెల్ చేసిన దూరమెంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. 2024 స్విగ్గీ కంపెనీ యానువల్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. అందులో బుక్ అయిన ఆర్డర్స్ కస్టమర్స్‌కు చేరవేయడానికి డెలివరీ బాయ్స్ 1.96 బిలియన్ కిలో మీటర్లు ప్రయాణించారట. ఇది 5 లక్షల 33 వేల సార్లు కాశ్మీర్ టూ కన్యా కుమారి వరకు వెళ్లిన దూరంతో సమానం. రికార్డ్ టైం 3 నిమిషాల్లోనే ఓ వ్యక్తి ఆర్డర్ చేసిన ఐస్ క్రీం డెలివరీ తీసుకున్నాడు. బెంగుళూర్‌కు చెందిన ఓ కస్టమర్ ఈ ఏడాది మొత్తం రూ.50 వేలు ఖర్చు చేసి స్విగ్గిలో ఫుడ్ ఐటమ్స్ బుక్ చేసుకొని తిన్నాడు. అతనే వాళ్ల బెస్ట్ కస్టమర్ మరి.

215 మిలియన్ ఆర్డర్స్ ఫుడ్ లవర్స్‌కు చేరవేసిందట స్విగ్గి కంపెనీ. అందులో చాలామంది ఎక్కువగా బిర్యానీనే బుక్ చేసుకున్నారు. ఈ సంవత్సరంలో 
డిసెంబర్ 23 నాటికి  ఇండియా మొత్తంలో 83 మిలియన్ల బిర్యానీలు స్విగ్గి ద్వారా బుక్ చేసుకున్నారట కస్టమర్స్. ఇది యావరేజ్‌గా చూస్తే.. ప్రతి నిమిషానికి 158 బిర్యానీలు బుక్ అవుతున్నట్లు. దాదాపు ప్రతి సెకన్‌కు రెండు బిర్యానీ ఆర్డర్స్ అందుతున్నాయి. బిర్యానీ తర్వాత ఎక్కువగా ఆర్డర్ చేసింది దోస. 23 మిలియన్ల దోస ఆర్డర్స్ వచ్చాయట. న్యూయర్, క్రిస్మస్ సెలబ్రేషన్స్ కారణంగా ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చు. స్విగ్గి ఇండియాలో బిజినెస్ స్టార్ట్  చేసి 9 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. లంచ్ కంటే 29 శాతం డిన్నర్ టైంలోనే స్విగ్గి బుకింగ్స్ అయ్యాయట.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు