Pawan Kalyan : ఓ వైపు వర్షం.. మరో వైపు కాలి గాయం : పిఠాపురంలో పవన్ రోడ్ షో ఆలస్యం
పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఈ రోజు నిర్వహించ తలపెట్టిన రోడ్ షో వర్షం కారణంగా ఆలస్యం కానుంది. ఇప్పటికే మంగళగిరి నుంచి పవన్ కల్యాణ్ పిఠాపురానికి బయలుదేరారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జనసేన కార్యకర్తలు భారీగా రోడ్ షోకు తరలివస్తున్నారు.