మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. విజయ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన తర్వాత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఓ దళిత గ్రామంలో ఇళ్లకు నిప్పు పెట్టారు. భయాందోళనతో దళితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో తలదాచుకున్నారు. గోహతా అనే గ్రామంలో బూత్ కబ్జా ఆరోపణలపై రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో కొందరు వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. దళితులపై రాళ్లు విసిరారు, వాళ్ల ఇళ్లకు నిప్పు పెట్టారు.
దీంతో భయాందోళనకు గురైన ఆ దళిత గ్రామస్థులు స్థానిక పోలీస్ స్టేషన్ వైపు పరిగెత్తారు. రాత్రంతా వారు అక్కడే గడిపారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే తమ ఆస్తులను నాశనం చేసిన వాళ్లపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దళితులు ఆరోపించారు. తమ ఆస్తులు ధ్వంసం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: వాట్సాప్‌ను నిషేధించాలని సుప్రీంకోర్టులో పిల్.. చివరికీ
ఇదిలాఉండగా.. దేశంలో అనేక చోట్ల ఇప్పటికీ దళితులపై దాడులు జరుగుతున్నాయి. కర్ణాటకలో దళితుల గుడిసెలకు నిప్పు పెట్టిన దోషులకు అట్రాసిటీ కేసులో ఇటీవల కోర్టు 98 మందికి జీవిత ఖైదు శిక్ష వేసిన సంగతి తెలిసిందే. అలాగే దళిత వర్గానికి చెందిన మరో ముగ్గురు నిందితులకు ఐదేళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధించింది.
కొప్పల్ జిల్లాలోని మరకుంబి గ్రామానికి కొందరు అగ్రవర్ణాల యువతకు, దళితులకు మధ్య థియేటర్ విషయంలో గొడవ జరిగింది. తమకు దూషించారని మంజునాథ్ అనే యువకుడు ఆరోపణలు చేశాడు. 2014, ఆగస్టు 28న తెల్లవారుజామున 4 గంటలకు మంజునాథ్, మరికొందరు వ్యక్తులు కలిసి కులం పేరుతో దూషిస్తూ ఎస్సీ కాలనీలో గుడిసెలు, ఇళ్లపై దాడులు చేశారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. చివరికీ ఇటీవల దీనిపై విచారణ జరిపిన కొప్పల్ జిల్లా, సెషన్స్ కోర్టు 98 మందికి జీవిత ఖైదు శిక్ష విధించింది.
Also Read: సరికొత్త హంగులతో ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాల.. చూస్తే మతిపోవాల్సిందే