విమాన ప్రమాదాలు.. గాల్లోనే పోతున్న ప్రాణాలు ప్రస్తుతం విమాన ప్రయాణాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే ప్రాణాలు పోయ్యే అవకాశాలు ఈ ప్రయాణానికే ఎక్కువ. గత 50ఏళ్లలో జరిగిన విమాన ప్రమాదాల్లో దాదాపు 2 లక్షల మంది చనిపోయారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Oct 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి 50ఏళ్లు.. దాదాపు 2 లక్షల మరణాలు.. ఇవి విమాన ప్రమాదల్లో చనిపోయిన వారి లెక్కలు..! విమాన ప్రయాణాలంటేనే భయపడాల్సిన పరిస్థితి.. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే ప్రాణాలు పోయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే ట్రాన్స్‌పోర్ట్ ఇదే! గాల్లో ఉండగానే ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి.. లేకపోతే సముద్రంలో మునిగిపోతాయి.. కనీసం డెడ్‌బాడీలు కూడా దొరకవు. నిన్నటికి నిన్న తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్ పోర్టులో పెను ప్రమాదమే తప్పింది. ఎయిరిండియా బోయింగ్ విమానం తిరుచ్చి ఎయిర్ పోర్టులో సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. అయితే గతంలో మాత్రం విమాన ప్రమాదాలు ఎంతోమందిని బలితీసుకున్నాయి. ఇక నిజానికి చాలా విమాన ప్రమాదాలు కంటికి చిక్కవు.. కొన్ని ప్రమాదాలు మాత్రం కెమెరాలకు చిక్కుతాయి. ఆగస్టు 22 1999లో చైనా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్-642 కుప్పకూలింది. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రాష్ అయ్యింది. బ్యాంకాక్ నుంచి తైపీకి వెళ్తున్న ఈ విమన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ల్యాండింగ్‌కు సమయంలో నంబర్ 3 ఇంజిన్ రన్‌వేని తాకడంతో మంటలు ఎగిసిపడ్డాయి. సెప్టెంబర్ 11, 2001.. అమెరికా చరిత్రలో నెత్తుటితో తడిసిన తేది ఇది. బోస్టన్‌లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే దేశీయ ప్రయాణీకుల విమానాన్ని ఆల్‌ఖైదా ఉగ్రవాదులు హైజాక్ చేశారు. 65 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న ఈ విమానంతో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌ను ఉద్దేశపూర్వకంగా క్రాష్ చేశారు. ఈ ఘటనలో దాదాపు 3 వేల మంది మరణించారు. Also Read: విమాన ప్రయాణికులను కాపాడిన రియల్ హిరోయిన్స్.. జూలై 19, 1989లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 232 క్రాష్ ల్యాండ్ అయ్యింది.. ఈ ప్రమాదంలో 112 మంది చనిపోయారు. 184 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అమెరికా చరిత్రలో ఇది అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఇది ఒకటి. డిసెంబరు 1, 1984లో అమెరికాలో మరో విమానం కూలిపోయింది. అయితే ఇది నాసా చేపట్టిన పరీక్ష. కావాలనే క్రాష్ ల్యాండ్ చేశారు. ఈ పరీక్ష తర్వాత భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వీటిని ఆర్పడానికి దాదాపు రెండు గంటలు గంటలు సమయం పట్టింది. నవంబర్ 23, 1996లో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 961 కుప్పకూలింది. అడ్డిస్ అబాబా నుంచి నైరోబీకి వెళ్తున్న ఈ విమానం ముందు హైజాక్‌కు గురైంది. ఆ తర్వాత ఇంధనం అయిపోయింది. దీంతో కొమొరోస్ దీవులలోని గ్రాండే కొమోర్ సమీపంలోని హిందూ మహాసముద్రంలో క్రాష్ -ల్యాండ్ అయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు హైజాకర్లతో సహా విమానంలోని 125 మంది ప్రయాణికులు చనిపోయారు. మే 5, 2019లో ఏరోఫ్లాట్ ఫ్లైట్-1492పై పిడుగు పడింది. దీని వలన ల్యాండింగ్ గేర్ కూలిపోయింది. రెక్కల నుంచి ఇంధనం చిమ్ముతూ వెంటనే మంటలు చెలరేగాయి. విమానం వెనుక భాగంలో మంటలు వ్యాపించాయి. విమానంలోని 78 మంది ప్రయాణికుల్లో 41 మంది మరణించారు. జూన్ 24, 1994లో ఫెయిర్‌చైల్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్ B-52 క్రాష్ అయ్యింది. ట్రైనింగ్ సెషన్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విమానంలోని నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు. ఇలా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ప్రమాదాలు చాలానే ఉన్నాయి. 2022లో DHL బోయింగ్ 757 హైడ్రాలిక్ వైఫల్యానికి గురైంది. కోస్టా రికన్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌లో క్రాష్ అయింది. అయితే ఇద్దరు పైలట్‌లలో ఎవరికీ గాయాలు కాలేదు. 2015లో ట్రాన్స్ ఏషియా ఫ్లైట్ 235 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజన్ లోపించి సమీపంలోని నదిలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న 58 మందిలో 43 మంది మరణించారు. Also Read: 20 స్థానాల్లో ట్యాంపరింగ్ జరిగింది: ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ సెప్టెంబరు 16, 2011న, రెనో ఎయిర్ రేస్‌లో ముస్టాంగ్ విమానం క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా రేసును చూస్తున్న 10 మంది ప్రేక్షకులు చనిపోయారు. మరో 70 మంది గాయపడ్డారు.1988లో జరిగిన రామ్‌స్టెయిన్ ఎయిర్ డిజాస్టర్ ఘటనను ఎవరు అంత ఈజీగా మర్చిపోరు. ఇటాలియన్ వైమానిక దళ ప్రదర్శన బృందం 3 విమానాలను క్రాష్ చేసింది. ఈ ఘటనలో 70 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. 2002లో యుక్రేనియన్ స్కినిలివ్ ఎయిర్ షో విపత్తు 77 మందికి చంపేసింది. ఈ ఎయిర్ షో సందర్భంగా ప్లేన్ క్రాష్ అవ్వడంతో 500 మందికి పైగా గాయాలయ్యాయి. #telugu-news #national-news #flight #flight-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి