/rtv/media/media_files/2025/07/04/air-india-crash-2025-07-04-11-51-17.jpg)
Air India Crash victims' families claim forced financial disclosures
విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్ లు సెకన్ పాటూ ఆగిపోవడమే యాక్సిడెంట్ కు కారణమని తేల్చింది ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. రెండూ ఒకేసారి ఆగిపోయాయని.. వాటిని ఎందుకు ఆఫ్ చేశావని రెండో పైలెట్...మెయిన్ పైలెట్ ను అడిగారని తెలుస్తోంది. అయితే మొదటి పైలెట్ తాను స్విఛాఫ్ చేయలేదని చెప్పారని...తర్వాత మేడే కాల్ ఇచ్చారని నివేదకలో రాశారు. మొత్తం 15 పేజీల నివేదికను ఏఏఐబీ సమర్పించింది.
పూర్తిగా సహకరిస్తాం..
ఈ ప్రాథమిక విచారణపై బోయింగ్ సంస్థ స్పందించింది. విచారణకు తాము పూర్తిగా స్పందిస్తామని తెలిపింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రొటోకాల్ ప్రకారం.. ఏఐ-171కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏఏఐబీకి అందించేందుకు సిద్ధంగా ఉన్నామన స్పష్టం చేసింది. దీనికి సంబంధించి బోయింగ్ సీఈఓ కెల్లీ ఓర్ట్‌బర్గ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపన ఆయన...వారికి అండగా ఉంటామని చప్పారు. ఎిర్ ఇండయా ఛైర్మన ఛంద్రశేఖర్ తో కూడా మాట్లాడమని చెప్పారు. విమాన ప్రమాద ద్యర్యాప్తుగా ఏఏఐబీ ఇతర అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు.
#Boeing issues statement in response to #AAIBReport on #AirIndia crash, addressing NDTV Profit's query
— NDTV Profit (@NDTVProfitIndia) July 12, 2025
Read: https://t.co/XXCW5WHF2dpic.twitter.com/ohIiETksFI
నో కామెంట్..
మరోవైపు ఎయిర్ ఇండియా మాత్రం ప్రథమిక నివేదిక మీద నో కామెంట్ అని చెప్పింది. విచారణ ఇంకా కొనసాగుతున్నందువలన దానిపై ఏమీ మాట్లాడలేమని చెప్పింది. బాధితులకు సంఘీభావం తెలుపుతూ..వారి కుటుంబాలకు సహాయం అందిస్తామని స్పష్టం చేసింది.
Air India acknowledges receipt of the preliminary report released by AAIB. #AirIndiaCrash
— NDTV Profit (@NDTVProfitIndia) July 12, 2025
Read more: https://t.co/UBEFboMinzpic.twitter.com/Mo0lcf3pJL
Also Read: BLF: పాక్ పై బలూచిస్తాన్ దాడి..50 మంది సైనికులు మృతి, 9 మంది ISI ఏజెంట్లు మృతి