లోక్‌సభలో తొలిసారిగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడారు. మొదటి ప్రసంగంలోనే కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. భారత రాజ్యంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక చర్చలో ఆమె పాల్గొన్నారు. దేశానికి రాజ్యాంగం సురక్ష కవచం లాంటిందని.. దీన్ని బద్ధలు కొట్టేందుకు గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: జొమాటో రూ.803 కోట్ల జీఎస్టీ కట్టాల్సిందే అంటూ నోటీసులు! Suraksha Kavach '' భారత రాజ్యాంగం దేశ పౌరులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ భరోసా కల్పిస్తుంది. రాజ్యాంగాన్ని బద్ధలు కొట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. ప్రైవేటీకరణ వల్ల రిజర్వేషన్‌లను బలహీనపర్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. కులగణన విషయంలో కేంద్ర సర్కారు అనుసరిస్తున్న వైఖరి సరికాదు. కులగణన చేపట్టాలంటే గతంలో కాంగ్రెస్ ఎందుకు చేయలేదని పాలకులు ప్రశ్నిస్తున్నారు. మేము ప్రస్తుతం గురించి అడుగుతుంటే గతం సంగతి ఎందుకు ? Also Read: మోదీ సర్కార్‌కు సవాళ్లు.. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందా ? ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వం నెహ్రూ హయాం గురించి ప్రస్తావిస్తోంది. నెహ్రూ ఉన్నప్పుడు అదెందుకు జరగలేదు, ఇదెందుకు జరగలేదు అంటున్నారు. మేము అధికారంలో ఉన్నా లేకున్నా, దేశం పూర్తి బాధ్యత నెహ్రూదేనా ?'' అని ప్రియాంక గాంధీ మోదీ ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రతీ విషయానికి నెహ్రూ పేరు ఎత్తేవాళ్లు, దేశం కోసం ఏం చేస్తున్నారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. Also Read: భార్యల వేధింపులకు భర్తలు బలి.. ఎన్ని ఘోరాలు జరిగాయంటే? Also Read: 90 ఏళ్ల బామ్మకు డిగ్రీ పట్టా..యువతకు ఆదర్శంగా రాబర్ట్ జర్నీ