Zomato: జొమాటో రూ.803 కోట్ల జీఎస్టీ కట్టాల్సిందే అంటూ నోటీసులు!

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు మరోసారి ఊహించని రీతిలో జీఎస్టీ డిమాండ్‌ నోటీసులు అందాయి.వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై రూ.803.4 కోట్ల మేరు ఉన్న జీఎస్టీ బకాయిలు చెల్లించాలంటూ కంపెనీకి నోటీసులు వచ్చాయి.

New Update
Zomato: శాకాహారం ఆర్డర్‌ ఇస్తే..మాంసాహారం..క్షమాపణలు చెప్పిన జొమాటో!

Zomato: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు మరోసారి ఊహించని రీతిలో జీఎస్టీ డిమాండ్‌ నోటీసులు అందాయి.వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై రూ.803.4 కోట్ల మేరు ఉన్న జీఎస్టీ బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ ఈ నోటీసులు కంపెనీకి వచ్చాయి. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌ సందర్భంగా జొమాటో కంపెనీ తెలిపింది.

Also Read: Manchu Manoj: మద్యం మత్తులో మంచు మనోజ్‌ గొడవ?

"2019 అక్టోబరు 29 నుంచి 2022 మార్చి 31 మధ్య కాలంలో డెలివరీ ఛార్జీలపై జీస్టీ బకాయిలు రూ.401.70 కోట్లుగా పేర్కొంటూ మహారాష్ట్రలోని ఠాణె జీస్టీ కార్యాలయం నుంచి జొమాటోకు ఉత్తర్వులు అందాయి. దీనిపై వడ్డీ, పెనాల్టీ కింద మరో రూ.401.70కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు" అని జొమాటో కంపెనీ తమ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే, దీనిపై తాము సంబంధిత అధికారుల ముందు అప్పీల్‌ చేయనున్నట్లు కంపెనీ వివరించింది.

Also Read: Mohan Babu: అయామ్‌ సారీ..మీడియాకి మోహన్ బాబు క్షమాపణలు!

ఇది చాలా తీవ్రమైన కేసు అని, దీనిపై తాము న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని జొమాటో సంస్థ పేర్కొంది. వాస్తవానికి గతంలోనూ జొమాటోకు ఈ తరహా జీస్టీ బకాయిల నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే.

కట్టి తీరాల్సిందే...

జొమాటోలో కస్టమర్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసినప్పుడు బిల్లులో మూడు అంశాలు ఉంటాయనే విషయం తెలిసిందే.అందులో ఆహార పదార్థాల ధర ఒకటి. మరొకటి ఫుడ్‌ డెలివరీ ఛార్జీ. సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నవారికి దీని నుంచి మినహాయింపు ఉంటుంది. మూడోది ఆహారం ధర, ప్లాట్‌ఫామ్‌ ఫీజుపై ఐదు శాతం పన్నుఉండడం. ఈ ట్యాక్స్‌ను జీస్టీ మండలి 2022 జనవరి నుంచి అమలు చేస్తోంది.

Also Read: Ganja Lady Don: హైదరాబాద్ మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్ అరెస్టు

నష్టపోతున్న జొమాటో షేర్లు

జొమాటో కంపెనీకి రూ.803.4 కోట్ల మేర జీస్టీ డిమాండ్ నోటీస్‌ వచ్చిన నేపథ్యంలో, ఆ కంపెనీ షేర్లు శుక్రవారం భారీగా నష్టపోతున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే దాదాపు 2 శాతం మేర సదరు కంపెనీ షేర్లు నష్టానికి గురయ్యాయి. 

Also Read: Marri Janardhan reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు