/rtv/media/media_files/2025/04/21/2utlWdTFiWaDvr2NPcuS.jpg)
Ravneet Singh Bittu
Ravneet Singh Bittu : కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు హత్యకు కుట్ర జరుగుతుందా? అంటే అవుననే అంటున్నారాయన. తనను చంపేందుకు కుట్ర జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు బిట్టు.
రాడికల్ ప్రచారకుడు, ఎంపీ అమృత్‌పాల్ సింగ్ నడిపిస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థతో పాటు ఆ సంస్థకు సంబంధమున్న ఖలిస్థానీ మద్దతుదారులు తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కేవలం తనకు మాత్రమే కాకుండా పంజాబ్‌లో మరికొంతమంది రాజకీయ నాయకుల ప్రాణాలకు కూడా ఖలిస్థానీల నుంచి ముప్పు పొంచి ఉందన్నారు.
Also Read: Zelensky: చెప్పుకోవడానికే కాల్పుల విరమణ..దాడులు మాత్రం ఆగడం లేదు!
సామాజిక మాధ్యమాల్లో లీకైన కొన్ని స్క్రీన్ షాట్ల ద్వారా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కేంద్రమంత్రి తెలిపారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృత్‌పాల్ నిర్బంధం మరో ఏడాది పొడిగించడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కూడా వారిస్ పంజాబ్ దే నాయకులు కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని వెల్లడించారు.
Also Read: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్
కాగా పంజాబ్ కు చెందిన రవనీత్ సింగ్ లూథియానా నుంచి మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో రైల్వేల సహాయ మంత్రిగా మరియు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. అంతకు ముందు 2009 లో ఆనంద్ పూర్ సాహిబ్ నుండి ఎన్నికయ్యారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడు అయిన బిట్టు చాలాకాలం కాంగ్రెస్‌లో పనిచేశారు. జనవరి 2021లో, జన్ సంసద్ కార్యక్రమంలో సింఘు సరిహద్దు వద్ద ఆయనపై దాడి జరిగింది. 2023లో, ఆయనకు వాట్సాప్ ద్వారా బాంబు బెదిరింపుకాల్ వచ్చింది . మార్చి 24, 2024న ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు . వెంటనే ఆయనకు కేంద్రమంత్రిగా అవకాశం కల్పించారు.
Also Read : Rajasthan : 17 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి మహిళ లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!