బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనర్ (18ఏళ్లలోపు) భార్య అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నా అది అత్యాచారమే అవుతుందని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలకు చట్టం నుంచి ఎలాంటి రక్షణ ఉండదని చెప్పింది. భార్యపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి మరో న్యాయస్థానం విధించిన పదేళ్ల శిక్షను బాంబే హైకోర్టు సమర్థించింది. 18 ఏళ్ల లోపు ఉన్న మహిళతో శృంగారంలో పాల్గొనడం అంటే .. ఆమె వివాహం చేసుకుందా ? లేదా ? అన్నదానితో సంబంధం లేకుండా అత్యాచారంగానే పరిగణించాలని తేల్చి చెప్పింది.
Also Read: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్‌షిప్‌లో ముద్దులు, హగ్‌లు సహజమే
ఇక వివరాల్లోకి వెళ్తే.. పెళ్లికి ముందు తనతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకోవడం వల్ల తాను గర్భం దాల్చాల్సి వచ్చిందని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. వాళ్లకి వివాహం అయినప్పటికీ, కొంతకాలం తర్వాత విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆమె తన భర్తపై కోర్టు మెట్లెక్కింది. వాళ్లకి పెళ్లి జరిగినప్పటికీ కూడా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా శృంగారంలో పాల్గొనడాన్ని కోర్టు అత్యాచారంగానే భావించింది.
Also Read : పాములు నిజంగా పగబడతాయా?..అసలు నిజమేంటి?
Consensual Sex
మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన ఆ బాధితురాలు తండ్రి, సోదరి, నానమ్మతో కలిసి ఉంటోంది. 2019లో ఆమె ఫిర్యాదు చేయడానికి ముందు మూడు నాలుగేళ్లుగా ఆ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉంది. ఈ క్రమంలో వాళ్ల మధ్య లైంగిక సంబంధం వల్ల ఆమె గర్భం దాల్చింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నప్పటికీ అబార్షన్ తొలగించుకోవాలని అతడు భార్యపై ఒత్తిడి చేశాడు. ఆమెపై భౌతిక దాడికి పాల్పడటమే కాక.. ఆ బిడ్డ వేరే వ్యక్తి వల్ల వచ్చిందనే ఆరోపణలు చేశాడు.
Also Read: 50వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు–రిలయెన్స్
దీంతో బాధిత మహిళ 2019లో పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు అరెస్టయ్యాడు. ఆ తర్వాత కేసు కోర్టు వరకు చేరింది. ఆమె అంగీకారంతోనే తాను శృంగారంలో పాల్గొన్నట్లు అతడు చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. పుట్టిన బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష చేయించగ.. వీళ్లిద్దరే తల్లిదండ్రులని నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలోనే కింది కోర్టు విధించిన శిక్షను బాంబే హైకోర్టు కూడా సమర్థించింది.
Also Read : గుండె పోటు నుంచి తప్పించుకోవాలంటే.. ఈ పనులు చేయండి!