Snake: పాములు నిజంగా పగబడతాయా?..అసలు నిజమేంటి? భారతీయ సంస్కృతిలో పాములను దేవతలుగా, శక్తివంతంగా చెబుతారు. పాముకు ఏదైనా హాని తలపెడితే అది పగ తీర్చుకుంటుందని అంటుంటారు. వాస్తవానికి పాము కాటుకు గురైన ఐదుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉంటే పాము పగబట్టిందంటూ భావిస్తారు. By Vijaya Nimma 15 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 భారతీయ సంస్కృతిలో పాములను దేవతలుగా కొలుస్తారు. పాములను శక్తివంతంగా పరిగణిస్తారు. ఎవరైనా పాముకు ఏదైనా హాని తలపెడితే అది పగ తీర్చుకుంటుందని అంటుంటారు. పాముల గురించి చాలా కథలు వినిపిస్తుంటాయి. నిజంగానే పాము పగ తీర్చుకుంటుందా? 2/6 పాములకు జ్ఞాపకశక్తి చాలా తక్కువ. అవి ప్రధానంగా వాటి ఇంద్రియాలపై ఆధారపడి పనిచేస్తుంటాయి. పాములు ఏవీ గుర్తుంచుకోలేవు, ఎవరినీ గుర్తుపెట్టుకోలేవని నిపుణులు అంటున్నారు. 3/6 పాములు ఒకదానితో ఒకటి కమ్యూనికేషన్ కోసం ఫెరోమోన్లను ఉపయోగిస్తాయి. ఒక పామును చంపినప్పుడు అది కొన్ని రకాల ఫెరోమోన్లను విడుదల చేస్తుంది. ఈ ఫెరోమోన్లు ఇతర పాములకు అక్కడ ప్రమాదం ఉందని సూచిస్తాయి. 4/6 శాస్త్రీయ దృక్కోణంలో పాములకు ప్రతీకారం తీర్చుకునే ధోరణి లేదు. అవి తమను తాము రక్షించుకోవడానికి లేదా ఆహారం కోసం మాత్రమే దాడి చేస్తాయి. అయితే పాములకు అతీంద్రియ శక్తులు ఉంటాయని కొందరు నమ్ముతారు. 5/6 సైన్స్ ప్రకారం పాములు వాటి ప్రవృత్తిని బట్టి మాత్రమే పనిచేస్తాయి. అయితే పాములకు సంబంధించిన ఎన్నో కథలు పురాణాల్లో ఉన్నాయి. 6/6 వాస్తవానికి పాము కాటుకు గురైన ఐదుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో చాలా మంది పాము పగబట్టిందంటూ భావిస్తారు. ఓ ఘటనలో అటవీశాఖ అధికారులు ముగ్గురిని కరిచింది ఒకే పాము కాదని గుర్తించారు. #snake మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి