/rtv/media/media_files/2025/03/21/PlES47mn3qwbqCusCO1Q.jpg)
justice Yashwant Varma
ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వర్మపై సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి చేసింది. ఈ విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. జస్టిస్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు ఉన్న మాట వాస్తమేనని, ఆయనను విధుల నుంచి తొలగించాలని కమిటీ సిఫార్సు చేసింది. జస్టిస్ వర్మ నివసిస్తున్న తుగ్లక్ క్రీసెంట్‌లోని అధికారిక నివాసంలో మార్చి 14 రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక, పోలీసులకు ప్రమాదం జరిగిన స్టోర్ రూమ్‌లో పెద్దయెత్తున నోట్ల కట్టలు కన్పించాయి. అందులో కొన్ని కాలిపోయాయి. ఆ నోట్ల గురించి తనకేమీ తెలియదని, అవి తనవి కావని వర్మ అన్నాడు. ఆ వీడయోలు వైరల్ కావడంతో దీనిపై పెద్దయెత్తున మీడియాలో ప్రచారం జరిగింది.
The committee report calls for removal of J. Yashwant Varma.#Justiceyashwantvarma#Delhihighcourtpic.twitter.com/vsNYWyetLZ
— LawChakra (@LawChakra) June 19, 2025
సుప్రీం కోర్టు కలుగజేసుకొని వర్మని వెంటనే అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. ఆయనపై విచారణకు త్రిసభ్య కమిటీని నియమించింది. పంజాబ్ హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ 10 రోజుల పాటు ఈ విచారణ నిర్వహించింది. తాజాగా ఈ కమిటీ విచారణను పూర్తి చేసి సుప్రీంకోర్టుకు తన నివేదికను సమర్పించింది. నోట్ల కట్టల వ్యవహారంలో జస్టిస్ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తన నివేదికలో నిర్ధారించింది. త్రిసభ్య కమిటీ జస్టిస్ వర్మ కుమార్తె సహా 55 మంది సాక్షులను విచారించింది.