/rtv/media/media_files/2025/06/01/jGiikIRz2AvVV61vqP8V.jpg)
LPG Cylinder Price Drop
మే నెల పూర్తయి.. నేటి నుంచి జూన్ నెల ప్రారంభమైంది. అయితే ప్రతి నెల ఒకటో తేదీన కొత్త కొత్త నిర్ణయాలు అమలులోకి రావడం సర్వసాధారణమైపోయింది. అందులో కొన్ని మన జేబులపై భారం మోపేవి అయితే.. మరికొన్ని ఊరటనిచ్చేవి. ఇదిలా ఉంటే మరీ ముఖ్యంగా ప్రతి నెలా ఒకటో తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటాయి.
Also Read : ‘కన్నప్ప’ హార్డ్ డిస్క్‌పై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
LPG Cylinder Price Cut
ఇందులో భాగంగానే ఈ జూన్ నెలలో కూడా అదే జరిగింది. ఇవాళ (జూన్ 1) గ్యాస్ సిలిండర్ ధరలు సవరించారు. అందులోనూ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను కంపెనీలు బాగా తగ్గించి వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పాయి. రెస్టారెంట్లు, హోటళ్లు సహా వాణిజ్య అవసరాల కోసం వాడే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి.
Also Read : ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా - పోలీస్ స్టేషన్ మెస్‌లోనే రేప్!
19 కేజీల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ ధరను రూ.24 తగ్గించినట్లు ఆయా కంపెనీలు వెల్లడించాయి. ఈ సవరించిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. రాష్ట్రాల వారీగా ఈ తగ్గింపులో మార్పులు ఉంటాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రిటైల్ ధర రూ. 1,723.50గా ఉంది. కాగా ఇంటి అవసరాలకు వినియోగించే 14.2 కేజీల LPG గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు సవరించలేదు.
Also Read : ఇరాన్ లో ముగ్గురు ఇండియన్స్ కిడ్నాప్..పాకిస్తాన్ నంబర్ నుంచి డబ్బులు?
ఇదిలా ఉంటే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గడం ఇది మూడో సారి. కంపెనీలు వరుసగా రెండు నెలలు ఈ ధరలను తగ్గించాయి. ఏప్రిల్ నెలలో రూ.41, మే నెలలో రూ.14.50 తగ్గాయి. ఇప్పుడు మూడో సారి జూన్ నెలలో రూ.24 దిగొచ్చింది. ప్రాంతాల వారీగా చూస్తే.. వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 24 తగ్గడంతో.. ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,723.50, కోల్‌కతాలో రూ.1826, ముంబైలో రూ.1674.50, చెన్నైలో రూ.1881గా ఉన్నాయి. అదే సమయంలో హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ. 25.50 తగ్గడంతో రూ. 1943.50 కి దిగొచ్చింది.
Also Read: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ ఎప్పుడంటే?
lpg-gas-cylinder-price-drop | lpg-cylinder-price | lpg-cylinder-price-reduced