/rtv/media/media_files/2026/01/14/man-dies-after-throat-slit-with-chinese-manja-2026-01-14-16-15-14.jpg)
Man dies after throat slit with Chinese manja
సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. చైనా మాంజా మెడకు చుట్టుకుని ఓ వ్యక్తి మరణించడం కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందినఅవిదేశ్ (35) అనే వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. ఫసల్వాది గ్రామం వద్ద చైనా మంజా అతడి మెడకు చుట్టుకుంది. బైక్‌పై అతడు వేగంగా వెళ్తుండగా ఒక్కసారిగా మాంజా మెడకు చుట్టుకుంది. దీంతో గొంతు తెగి అతడు అక్కడిక్కడే మృతి చెందారు. ఇది చూసిన స్థానికులు షాకైపోయారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Follow Us