/rtv/media/media_files/2025/03/23/thI66tThphdtP4n4DqDR.jpg)
SLBC Tunnel and CM Revanth
నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అక్కడ జరుగుతున్న పనులపై సీఎం రేవంత్ ఆరా తీశారు. సహాయక చర్యల ఆలస్యానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఇందుకోసం రూ.5 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. టన్నెల్ వద్ద పనులు మరింత వేగవంతం చేయడంపై సీఎం రేవంత్ సమీక్ష చేయనున్నారు.
Also Read: ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రీడ ఏదో తెలుసా..?
ఫిబ్రవరిలో 22న నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట శివాలం ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పైకప్పు కూలింది. ఉదయం 8.30 AM గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఒక్కక్కరిగా మొత్తం 42 మందిని మధ్నాహ్నం లోపు రక్షించారు. కానీ 8 మంది సిబ్బంది సొరంగం లోపలే చిక్కుకుపోయారు.
Also Read: ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్న కెనడా.. ఆ పార్టీ వైపే ఓటర్లు
వాళ్లు బతికే ఉన్నారని ముందుగా అందరూ భావించారు. కానీ వాళ్లని బయటికీ తీయడం సాధ్యం కాకపోవడంతో వాళ్లు సజీవ సమాధి అయ్యారు. మార్చి 9న సహాయక సిబ్బంది ఒక్క మృతదేహాన్ని మాత్రమే బయటికి తీశారు ఇంకా మిగతా ఏడుగురి కోసం గాలిస్తూనే ఉన్నారు. టన్నెల్‌లోపల D1-D2ను అనుమానిత ప్రాంతాలుగా మార్క్ చేసి తవ్వకాలు జరుపుతున్నారు. అయితే ఈ సొరంగంలో జరిగిన ప్రమాదం దేశంలోనే అరుదైనదని నిపుణులు అంటున్నారు. భారీగా ఊటనీరు, బురద రావడం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
Also Read: ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా..పదేళ్ళల్లో జీడీపీ డబుల్
Also Read: 9 ఏళ్ల పిల్లాడిని వదిలి ప్రియుడితో తల్లి జంప్.. ఆ తర్వాత ఏమైందంటే?
SLBC tunnel | telugu-news | rtv-news | cm revanth
Follow Us