/rtv/media/media_files/2024/11/02/GK8eSTYUlr5VC7rtpztx.jpg)
చార్‌ధామ్‌గా ప్రసిద్ధి చెందిన హిందూ పుణ్యక్షేత్రాలేవంటే కేదర్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలు గుర్తుకువస్తాయి. అయితే చలికాలం సమీపించడంతో ఈ ఆలయ తలుపులు మూతపడనున్నాయి. ప్రతిఏడాది చలికాలం సమయంలో వాతావరణ పరిస్థితులు దృష్ట్యా ఈ నాలుగు ఆలయాలను ఆరు నెలల పాటు మూసివేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ వేసవికాలంలో చార్‌ధామ్ యాత్రను మళ్లీ ప్రారంభిస్తారు.
Also Read: కులగణన సమావేశానికి రాహుల్ గాంధీ వస్తారు.. మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన
అయితే ఈ ఏడాది మే 10న ఛార్‌ధామ్ యాత్ర ప్రారంభం కాగా ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఈ నాలుగు ఆలయాల్లో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేశారు. మరో కీలకమైన కేదార్‌నాథ్ ఆలయాన్ని నవంబర్ 3న ఉదయం 8.30 గంటలకు మూసివేయనున్నారు. మరోవైపు బద్రినాథ్ ధామ్‌ను నవంబర్ 17న రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నారు. ఇక యమునోత్రి ఆలయ తలుపులు కూడా మూసివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Also Read: ఉగ్రవాదులకు సరైన బదులిస్తాం.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
చలికాలంలో ఈ ఆలయాలో పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి. అనుకూల వాతావరణ పరిస్థితులు ఇక్కడ ఉండవు. భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. గడ్డకట్టే చలికి భక్తుల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే చలికాలంలో ఈ నాలుగు ఆలయాలను ప్రతీ సంవత్సరం మూసివేస్తూ వస్తున్నారు. మళ్లీ వేసవిలో వీటిని పునఃప్రారంభిస్తారు. ఛార్‌ధామ్ యాత్రకు దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తుంటారు. భారత్‌లో చాలామంది భక్తులు ఈ ప్రాంతాలకు జీవితంలో ఒక్కసారైనా వెళ్లిరావాలని అనుకుంటారు. అందుకే ఈ ఆలయాలు తెరచిఉన్నప్పుడు ఎప్పుడూ కూడా భక్తులతో సందడి వాతావరణం ఉంటుంది.
Also read: స్టాక్ మార్కెట్లోకి తెలుగు..మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఎన్‌ఎస్‌ఈ
Also Read: యూపీఐ కస్టమర్లకు షాక్.. రెండు రోజులు సేవల్ బంద్!