Modi Maldives visit: మాల్దీవ్, భారత్ స్నేహం చూసి.. చైనా కళ్లు మండుతున్నాయ్!

మాల్దీవులు స్వతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ 2రోజుల పర్యటన కోసం జూలై 25న అక్కడికి చేరుకున్నారు. ఆయనకు అక్కడ భారీ కటౌట్లు ఏర్ఫాటు చేశారు. మల్దీవ్ అలాగే రోడ్ల వెంట త్రివర్ణ పతాకాలు పెట్టారు. ఇదంతా చైనా జీర్ణంచుకోలేకపోతుంది.

New Update
PM Modi visit to the Maldives

PM Modi's visit to the Maldives

ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన కోసం జూలై 25న మాల్దీవులు చేరుకున్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఆహ్వానం మేరకు, మోదీ మాల్దీవుల 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వెళ్లారు. రాజధాని మాలెలో జరిగిన కార్యక్రమంలో నరేంద్ర మోదీకి తుపాకీ గౌరవ వందనంతో స్వాగతం పలికారు. మోదీకి స్వాగతం పలికే క్రమంలో మాల్దీవుల రాజధాని మాలేలో ఆయన బ్యానర్లు ఏర్పాటు చేశారు. మాల్దీవ్ కంటే ముందు ఆయన రిపబ్లిక్ స్క్వేర్‌కు వెళ్లారు. ఎయిర్ పోర్ట్ ప్రధాన రహదారులతో సహా రాజధానిలోని అనేక రోడ్లలో త్రివర్ణ పతాకంతో అలంకరించారు. అంతే కాదు ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ.. మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ బిల్డింగ్‌పై పెద్ద కటౌట్ పెట్టారు. ఇది చూసిన చైనా కళ్లు మండుతున్నాయి. ఇండియా ప్రధానికి ఇలా గొప్పగా స్వాగతం పలకడం చైనాకు నచ్చలేదు. భారత్, మాల్దీవ్ దౌత్యసంబంధాలు దగ్గరవుతుండటం చైనా జీర్ణించుకోలేకపోతుంది.

ప్రధాని మోదీకి ఆ దేశంలో ఇది మూడో అధికారిక పర్యటన. మొహమ్మద్ ముయిజు అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తర్వాత మాల్దీవులకు అధికారిక పర్యటనకు వచ్చిన మొదటి విదేశీ దేశాధినేత ప్రధాని మోదీ. కొంతకాలంగా ఇండియా, మాల్దీవుల మధ్య సంబంధాలలో ఉద్రిక్తత ఉన్నప్పటికీ, ప్రధాని మోదీని మాల్దీవుల్లో స్వాగతించి గౌరవించడం చూసి చైనా కోపంగా ఉంటుంది. మాల్దీవులలో అధికారంలోకి వచ్చిన తర్వాత, మొహమ్మద్ ముయిజు న్యూఢిల్లీకి బదులుగా చైనా రాజధాని బీజింగ్‌కు అధికారిక పర్యటన చేశారు. ఆ పర్యటన సందర్భంగా, చైనా ఫ్రీగా ప్రాణాంతకం కాని ఆయుధాల కోసం మాల్దీవులతో ఒప్పందంపై సంతకం చేసింది. మాల్దీవుల సైనికులకు శిక్షణ ఇవ్వడానికి కూడా అంగీకరించింది. రెండేళ్ల తర్వాత ప్రస్తుతం భారతదేశం, మాల్దీవుల మధ్య సంబంధాలు తిరిగి గాడిన పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇది మాల్దీవుల ద్వారా హిందూ మహాసముద్రంలో తన ప్రభావాన్ని స్థాపించాలనే చైనా కోరికను దెబ్బతీస్తున్నట్లు కనిపిస్తోంది.

https://x.com/Truth_Unplugged/status/1948700884172484858/photo/1

Advertisment
తాజా కథనాలు