Indian Army: భారత సైన్యం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి: మాల్దీవులు అధ్యక్షుడు
మాల్దీవులకు ఇటీవల మొహమ్మద్ మయిజ్జు అనే నేత నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మాల్దీవుల్లో ఉన్న ఇండియన్ ఆర్మీ ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఈ విషయంపై భారత్తో చర్చలు ప్రారంభించామని పేర్కొన్నారు.