భారత సీజేఐ(చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా)గా జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 11న బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఆయనకు సంబంధించి ఓ కీలక విషయం బయటపడింది. జస్టిస్ ఖన్నా ప్రతిరోజూ ఇష్టంగా మార్నింగ్ వాక్ చేస్తుంటారు. ఇకనుంచి దాన్ని పూర్తిగా మానేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఢిల్లీలో లోధి గార్డెన్ వద్ద ఆయ ప్రతిరోజూ ఒంటరిగా కొన్ని కిలోమీటర్ల వరకు మార్నింగ్ వాక్ చేస్తారు. త్వరలో ఆయన సీజేఐగా బాధ్యతలు తీసుకోవడంతో చాలామంది ఆయన్ని గుర్తుపట్టే ఛాన్స్ ఉంది. ఇందుకోసం సెక్యురిటీని వెంట బెట్టుకొని వాకింగ్ చేయాల్సి ఉంటుంది.
Also Read: రోడ్డు మీద ఉమ్మివేస్తున్నారా జాగ్రత్తా.. వారి కంటపడితే ఖతమే!
జస్టిస్ సంజీవ్ ఖన్నాకు మాత్రం ఇలా చేయడం ఇష్టం లేదు. అందుకే మార్నింగ్ వాక్‌ను పూర్తిగా మానేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఖన్నా దేశంలో చరిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చిన ధర్మసనాల్లో కీలక పాత్ర పోషించారు. ఎన్నికల బాండ్లు, ఆర్టికల్ 370 రద్దు, ఈవీఎంల వినియోగంపై సమర్థన లాంటి అంశాలపై తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో ఆయన కూడా భాగస్వామిగా ఉన్నారు. అంతేకాదు.. రాజ్యాంగంలో ఎన్న సవరణలు చేసినా.. దాని మౌలిక స్వరూపాన్ని మార్చడానికి వీల్లేదని 1973లో కేశవానంద భారతీ కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్లో ఆయన కూడా ఒకరు.
Also Read: Minister Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ
విభిన్న రంగాల్లో అనుభవం
జస్టిస్ సంజయ్ ఖన్నా 1960 మే 14న ఢిల్లీలో జన్మించారు. ఢిల్లీలోని బరాఖంబా రోడ్‌లోని మోడరన్ స్కూల్‌లో చదివారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలోని లా సెంటర్ క్యాంపస్‌లో చదువు పూర్తి చేశారు. 1983లో తన పేరును ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నారు. తీస్ హజారీ కాంప్లెక్స్ జిల్లా కోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు, ట్రైబ్యునల్స్‌లో రాజ్యంగ, ప్రత్యక్ష పన్నులు, మధ్యవర్తిత్వం వంటి విభిన్న రంగాల్లో కూడా ప్రాక్టీస్ చేశారు. ఇక 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Also Read: మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు!
కేవలం ఆరు నెలలే
2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ అందుకున్నారు. జస్టిస్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తిగా ఆరు నెలల మాత్రమే పదవీ కాలంలో ఉంటారు. సీజేఐ పదవీ కాలం 65 ఏళ్ల వరకు మాత్రమే ఉంటుంది. డీవై చంద్రచూడ్ నవంబర్ 10తో 65 ఏటా అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పదవీ విరమణ చేయనున్నారు. మరో ఆరు నెలల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నాకు కూడా 65 ఏళ్లు వస్తాయి. అందుకే ఆయన కేవలం ఆరు నెలలు మాత్రమే సీజేఐగా కొనసాగుతారు.
ఇది కూడా చదవండి: హార్స్ పవర్ అంటే ఏంటి?..గుర్రాలకు ఎంత శక్తి ఉంటుంది?