Maoist Leader: లొంగిపోయిన మరో మావోయిస్టు అగ్రనేత

మావోయిస్టు అగ్రనేత పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. ఇటీవల అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ రావు అలియాస్‌ అభయ్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ దగ్గర లొంగిపోయిన విషయం తెలిసిందే.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

మావోయిస్టు అగ్రనేత పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న(Asana) లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలో భాగంగా మావోయిస్టులు తమ ఆయుధాలను భారీ సంఖ్యలో విడిచిపెడుతున్నారు. ఇటీవల అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ రావు అలియాస్‌ అభయ్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ దగ్గర లొంగిపోయారు. ఇప్పుడు అదే బాటలో ఆశన్న కూడా చేరారు. ఆయుధాలను పడేసి అతను కూడా లొంగిపోయారు. మొత్తం 208 మావోయిస్టులు లొంగిపోయారు. ఇదిలా ఉండగా మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ 60 మందితో కలిసి జనజీవన స్రవంతిలో కలిశారు. అక్కడికి కొన్ని గంటల వ్యవధిలోనే ఆశన్న లొంగిపోయారు.

ఇది కూడా చూడండి: Maoists : అడవిని వీడుతున్న అన్నలు..రేపు మరో 140 మంది లొంగుబాటు

Maoist Leader Takkellapalli Vasudevarao Alias Asanna Surrender

ఇది కూడా చూడండి: Kacha Badam singer : 'కచ్చా బాదాం' సింగర్ లైఫ్ ఛేంజ్.. పెద్ద ఇళ్లు, కారు - చూస్తే పిచ్చెక్కిపోతారు..!

Advertisment
తాజా కథనాలు