/rtv/media/media_files/2025/05/27/3TTS2VbA3ermrGCHtUdV.jpg)
Chhattisgarh Sukma 18 Naxals surrender
Maoist: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 18 మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందులో నలుగురు PLGA సభ్యులున్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. 10 మందిపై మొత్తం రూ.38 లక్షల రివార్డు ప్రకటించినట్లు చెప్పారు.
నక్సల్ రహిత గ్రామ పంచాయతీ..
ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న నక్సల్ రహిత గ్రామ పంచాయతీ పథకంలో సాధించిన మరో విజయం అని ఎస్సీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో పెద్దఎత్తున మావోయిస్టులను భద్రతాదళాలు మట్టుబెట్టాయని, ఈ నేపథ్యంలో మిగతా వారంతా లొంగిపోతున్నట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి: సంచలన అప్‌డేట్.. పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ బాంబు దాడి !
జార్ఖండ్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు దళ కమాండర్ మృతిచెందారు. సోమవారం రాత్రి పలాము జిల్లాలోని హైదర్‌నగర్-మహమ్మద్‌గంజ్ పోలీస్ స్టేషన్ల మధ్య ఉన్న సీతాచువాన్ అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు. అలాగే జార్ఖండ్‌లోని లాతహోర్‌లో సోమవారం మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు సభ్యుడు మనీశ్ యాదవ్ మృతిచెందాడు. అతనిపై రూ.5 లక్షల రివార్డు ఉన్నదని అధికారులు వెల్లడించారు. రూ.10 లక్షల రివార్డున్న పార్టీ జోనల్ కమాండర్ కుందన్ సింగ్ ఖర్వర్‌ను అరెస్టు చేశామని భద్రతా బలగాలు వెల్లడించాయి.