Chhaava Movie : కేంద్రం సంచలన నిర్ణయం.. పార్లమెంట్‌లో ఆ సినిమా ప్రదర్శన

మరాఠా పోరాట యోధుడు, ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా డైరెక్టర్ ల‌క్ష్మణ్ ఉటేక‌ర్ ‘ఛావా’ చిత్రాన్ని రూపొందించిన విషయం విదితమే. తాజాగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో ఛావా సినిమాను ప్రదర్శించాలని భావిస్తోంది.

New Update
 Chhaava Movie

Chhaava Movie

Chhaava Movie : మరాఠా పోరాట యోధుడు, ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా డైరెక్టర్ ల‌క్ష్మణ్ ఉటేక‌ర్ ‘ఛావా’ చిత్రాన్ని రూపొందించిన విషయం విదితమే. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఈ చిత్రం హిందీతో పాటు పలు భాషల్లో విడుదలై దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. సుమారు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉండగా.. తాజాగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పార్లమెంట్‌లో ఛావా సినిమాను ప్రదర్శించాలని భావిస్తోంది. దేశంలోని ఎంపీలంతా చూడాల్సిన సినిమా అని.. రేపు గురువారం రోజున ఎంపీలంతా రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విపక్ష పార్టీల ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారు సినిమా ప్రదర్శన రోజు వస్తారా? రారా? అనే సందిగ్ధత నెలకొంది.

Also Read:Court Movie Collections: ‘కోర్టు’ కిక్కే కిక్కు.. రూ.10 కోట్ల బడ్జెట్- రూ.50 కోట్ల కలెక్షన్- USలో రచ్చ రచ్చే

గురువారం ‘ఛావా’ సినిమా ప్రదర్శన ఉంటుందని, ఎంపీలందరూ తప్పకుండా హాజరుకావాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా కారణంగానే ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని ఇటీవల ఆందోళనలు జరిగాయని, నాగ్ పూర్ లో హింస చెలరేగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మతపరమైన ఉద్రిక్తతలకు కారణమైనటువంటి సినిమాను పార్లమెంటులో ప్రదర్శించడమేంటని ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఛావా’ సినిమా ప్రదర్శనను ప్రతిపక్ష ఎంపీలు బాయ్ కాట్ చేయనున్నట్లు సమాచారం.

Also Read:Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!

2025 ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సూప‌ర్ హిట్ సినిమాను రీసెంట్‌గా తెలుగులో కూడా విడుద‌ల చేయ‌గా.. భారీ వ‌సుళ్లను సాధించింది. ఈ సినిమాకు ల‌క్ష్మణ్ ఉటేక‌ర్ ద‌ర్శకత్వం వ‌హించ‌గా.. దినేష్ విజన్ నిర్మించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్  సొంతం చేసుకుంది. సుమారు నెల రోజుల తర్వాతే ఓటీటీలోకి ఈ మూవీని తీసుకుని రావాలని ముందుగానే డీల్ జరిగిందట. అయితే ఇటీవల ఛావా మూవీ ఆన్ లైన్ లో దర్శనమిచ్చింది. కొందరు ఈ మూవీని పైరసీ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Also Read :  ఛోక్సీ మా దేశంలోనే ఉన్నాడు: బెల్జియం!

Advertisment
తాజా కథనాలు