వరద సహాయం నిధులు విడుదల చేసిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే!

రాష్ట్రాలకు వరద సహాయం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 14 రాష్ట్రాలకు రూ.5,858 కోట్ల నిధులు కేటాయించింది. తెలంగాణకు రూ. 416.80, ఏపీకి రూ.1,036 కోట్లు NDRF నిధులు రిలీజ్ చేసింది. మహారాష్ట్రకు రూ.1,432 కోట్లు విడుదల చేసింది. 

dddd
New Update

Central Govt Flood Relief Funds: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అల్లకల్లోలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. 14 రాష్ట్రాలకు రూ.5,858 కోట్ల నిధులు కేటాయించింది. తెలంగాణకు రూ. 416.80, ఏపీకి రూ.1,036 కోట్లు NDRF నిధులు రిలీజ్ చేసింది. మహారాష్ట్రకు అత్యధికంగా రూ.1,432 కోట్లు విడుదల చేసింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో పాటు, కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే. 

వర్షాల సమయంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహాన్ విజయవాడ వచ్చి వెళ్లిన 24 గంటల్లోనే కేంద్ర సాయం ప్రకటించడంపై మంత్రి లోకేశ్​ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి చౌహాన్​లకు కృతజ్ఞతలు తెలిపారు.

 

#andhra-pradesh #telangana #floods #central-govt #funds
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe